Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google New Feature: మీరు వెళ్ళేదారిలో ట్రాఫిక్ ఇంటి నుంచే చూడవచ్చు.. గూగుల్‌ నుంచి సరికొత్త ఫీచర్‌

మీరు అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ కారులో వెళ్లాలని అనుకున్నారు. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశారు. దారి చూసుకున్నారు.. బయలుదేరారు.. దారిలో ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు. వెళ్లాల్సిన చోటుకు గంట లేటుగా వెళ్లారు.. ఇలా జరగడం సహజమే కదా.. కానీ.. మీరు బయలుదేరే ముందే ఆ దారిలో ట్రాఫిక్..

Google New Feature: మీరు వెళ్ళేదారిలో ట్రాఫిక్ ఇంటి నుంచే చూడవచ్చు.. గూగుల్‌ నుంచి సరికొత్త ఫీచర్‌
Google Map
Follow us
Subhash Goud

|

Updated on: May 12, 2023 | 9:01 PM

మీరు అమీర్ పేట నుంచి హైటెక్ సిటీ కారులో వెళ్లాలని అనుకున్నారు. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేశారు. దారి చూసుకున్నారు.. బయలుదేరారు.. దారిలో ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు. వెళ్లాల్సిన చోటుకు గంట లేటుగా వెళ్లారు.. ఇలా జరగడం సహజమే కదా.. కానీ.. మీరు బయలుదేరే ముందే ఆ దారిలో ట్రాఫిక్ ఎలా ఉందో స్పష్టంగా చూడగలిగితే.. అదిరిపోతుంది కదూ.. అప్పుడు ట్రాఫిక్ ను బట్టి మన దారి మార్చుకోవచ్చు. లేదా మనం వెళ్లాలసిన ప్రాంతానికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుందని మన కోసం ఎదురు చూసేవారికి చెప్పవచ్చు. కదా. ఇదంతా మీకు అతిగా అనిపిస్తోందా..? అయితే మీరు తప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే.. గూగుల్ మ్యాప్స్ ఇప్పుడు ఇంటిలో కూచుని.. మీరు వెళ్ళే దారిలో ట్రాఫిక్ ఎలా ఉందో చూసే అవకాశం తీసుకువస్తోంది. అంతేకాదు.. ఆ మార్గంలో గాలి నాణ్యతా.. రియల్ టైమ్ వెదర్ కూడా తెలుసుకోవచ్చు. ఈ ఫీచర్ పేరు ‘ఇమ్మర్సివ్ వ్యూ’

మీరు నడుస్తున్నా, సైకిల్ తొక్కుతున్నా లేదా వాహనంలో ఉన్నా. IOS, Android, Google Maps మూడు ప్లాట్‌ఫారమ్‌లలో ‘ఇమ్మర్సివ్ వ్యూ’ ఫీచర్ పని చేస్తుంది. ఈ వేసవి సీజన్‌లో ఈ సర్వీస్‌ను ప్రారంభిస్తామని, ఏడాది చివరి నాటికి 15 నగరాల్లో అందుబాటులోకి వస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు. ఈ నగరాల్లో న్యూయార్క్, లండన్, పారిస్, ఫ్లోరెన్స్, ఆమ్‌స్టర్‌డామ్, శాన్ ఫ్రాన్సిస్కో, వెనిస్, సీటెల్, టోక్యో, శాన్ జోస్, లాస్ వెగాస్, బెర్లిన్, లాస్ ఏంజిల్స్, డబ్లిన్, మయామి ఉన్నాయి. మన దేశంలో ఈ ఫీచర్ రావడానికి కొంత సమయం పట్టవచ్చు.

ఈ ఫీచర్ సహాయంతో మీరు మీ ప్రయాణ ప్లాన్ మార్చుకోవచ్చు. మీరు వెళ్లాల్సిన రూట్ లో ట్రాఫిక్ సమస్యలు ఉంటే కనుక మీరు వేరే రూట్ ఎంచుకోవచ్చు. అయితే, దీనిలో మీరు ఎంచుకున్న రూట్ వరకూ మాత్రమే ట్రాఫిక్ కనిపిస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. వీడియో వ్యూ కలిపి ఈ ట్రాఫిక్ ఇమ్మార్సివ్ వ్యూ ఫీచర్ తీసుకువస్తోంది గూగుల్. ప్రస్తుతానికి కొన్ని దేశాల్లోనే దీనిని అందుబాటులోకి తీసుకువాస్తున్నప్పటికీ త్వరలోనే మరిన్ని దేశాల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ తో మన ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంది. అంతే కాకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా అప్రమత్తమై ట్రాఫిక్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వాహనాలను నియంత్రించే అవకాశం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి