AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: జొన్న పంట రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతుల ఏవిధమైన నష్టపోకుండా ఉండేందుకు వారికి అంగడా నిలిచేందుకు చర్యలు చేపడుతున్నారు. రైతులకు మద్దతు ధర విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరను ప్రకటిస్తున్నారు..

Telangana: జొన్న పంట రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Cm Kcr
Subhash Goud
|

Updated on: May 12, 2023 | 6:26 PM

Share

రైతుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రైతుల ఏవిధమైన నష్టపోకుండా ఉండేందుకు వారికి అంగడా నిలిచేందుకు చర్యలు చేపడుతున్నారు. రైతులకు మద్దతు ధర విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరను ప్రకటిస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ, 2022-23 యాసంగి సీజన్‌లో పండించిన జొన్న(హైబ్రిడ్) పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మార్క్ ఫెడ్ ఎండి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

యాసంగి సీజన్‌లో పండిన మొత్తం 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ.219.92 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటి ఇవ్వనున్నది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామరెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల పరిధిలో జొన్న పంటను పండించిన దాదాపు లక్షమంది రైతులకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ద్వారా లబ్ది చేకూరనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి