Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Android 14: అందుబాటులోకి ఆండ్రాయిడ్ 14.. మీ ఫోన్ సపోర్టు చేస్తుందా లేదా తెలుసుకోండి..

ఈ ఆండ్రాయిడ్ 14 బీటా వెర్షన్ కేవలం గూగుల్ పిక్సల్ హ్యాండ్ సెట్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ ఎంటంటే ఆండ్రాయిడ్ 14 రెండో వెర్షన్ నాన్ పిక్సల్ ఫోన్లలలో పనిచేస్తుంది. వివో, వన్ ప్లస్, రియల్ మీ, జియోమీ, నథింగ్ వంటి హ్యాండ్ సెట్లలో ఈ ఆండ్రాయిడ్ 12 రెండో వెర్షన్ వర్క్ అవుతుంది.

Android 14: అందుబాటులోకి ఆండ్రాయిడ్ 14.. మీ ఫోన్ సపోర్టు చేస్తుందా లేదా తెలుసుకోండి..
Android 14
Follow us
Madhu

|

Updated on: May 13, 2023 | 5:15 PM

సెర్చ్ జెయింట్ గూగుల్ నిర్వహించిన మెగా ఈవెంట్ గూగుల్ ఐ/ఓ 2023 ముగిసింది. దీనిలో అనేక కొత్త ఉత్పత్తులను గూగుల్ ఆవిష్కరించింది. వాటిల్లో వర్చువల్ అనుభవాన్నిచ్చే ఆండ్రాయిడ్ 14తో కూడిన పిక్సల్ 7ఏ, పిక్స్ ఫోల్డ్ వంటి వాటిని మార్కెట్లోకి విడుదల చేసింది. అయితే ఈ ఆండ్రాయిడ్ 14 బీటా వెర్షన్ కేవలం గూగుల్ పిక్సల్ హ్యాండ్ సెట్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు గుడ్ న్యూస్ ఎంటంటే ఆండ్రాయిడ్ 14 రెండో వెర్షన్ నాన్ పిక్సల్ ఫోన్లలలో పనిచేస్తుంది. వివో, వన్ ప్లస్, రియల్ మీ, జియోమీ, నథింగ్ వంటి హ్యాండ్ సెట్లలో ఈ ఆండ్రాయిడ్ 12 రెండో వెర్షన్ వర్క్ అవుతుంది. దీనిని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి? దానిలోని ఫీచర్లు ఏంటి? తెలుసుకుందాం రండి..

ఆండ్రాయిడ్ 14లో కొత్త ఏముంటాయంటే..

గూగుల్ తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ 14 రెండో వర్షన్ లో ఏఐ కేసెస్ ను వినియోగించుకుంటుంది. కొత్త లాక్ స్క్రీన్, వాల్ పేపర్స్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 13 ఉన్న ఫోన్లను అప్ డేట్ చేసుకోవడం ద్వారా కొత్త ఆండ్రాయిడ్ 14 వెర్షన్ను పొందవచ్చు.

ఆండ్రాయిడ్ 14 ఇన్ స్టాల్ ఇలా..

కొత్త అప్ డేట్ వెర్షన్ కోసం మీరు తయారీదారు వెబ్ సైట్ లోకి వెళ్లి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అయితే మొదట మీ డివైజ్ ఆండ్రాయిడ్ 14కి సపోర్టు చేస్తుందో లేదో తెలుసుకోవాలి. అందుకే ఆండ్రాయిడ్ 14 పనిచేసే ఫోన్ల జాబితా ను ఇక్కడ ఇచ్చాం. ఆ లిస్ట్ పరిశీలించండి.

ఇవి కూడా చదవండి

వివో ఎక్స్90ప్రో, ఐక్యూఓఓ11, నథింగ్ ఫోన్(1), వన్ ప్లస్ 11, ఒప్పో ఫైండ్ ఎన్2, ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్, రియల్ మీ జీటీ 2 ప్రో, టెక్నో కామన్ 20 సిరీస్, లెనోవా ట్యాబ్ ఎక్స్ ట్రీం, జియోమీ 13 ప్రో, జియమీ 13, జియోమీ 12టీ ఫోన్లలో ఆండ్రాయిడ్ 14 వర్క్ అవుతుంది.

ఒక వేళ మీరు గూగుల్ పిక్సల్ ఫోన్లకు వినియోగిస్తున్నట్లయితే.. మీరు ఆండ్రాయిడ్ 14 లేటెస్ట్ వెర్షన్ అందుకోవాలంటే ముందుగా డెవలపర్స్ వెబ్ సైట్ లో ఎన్ రోల్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ 14 సపోర్టు చేసే గూగుల్ పిక్సల్ ఫోన్లు ఇవే..

పిక్సల్ 4ఏ(5జీ), పిక్సల్ 5, పిక్సల్ 5ఏ, పిక్సల్ 6, పిక్సల్ 6 ప్రో, పిక్సల్ 6ఏ, పిక్సల్ 7, పిక్సల్ 7 ప్రో, పిక్సల్ 7ఏ, పిక్సల్ ఫోల్డ్, పిక్సల్ ప్యాడ్.

అయితే మరిన్ని బ్రాండ్ ఫోన్లలో కూడా వచ్చే జూలై నుంచి ఆండ్రాయిడ్ 14 అందుబాటులోకి రానుంది. ఆ కంపెనీల జాబితాలో శామ్సంగ్ కూడా ఉంది. శామ్సంగ్ ఫోన్లలో కూడా ఈ జూలై నుంచి ఆండ్రాయిడ్ 14 వెర్షన్ 2 అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..