Gmail: జీమెయిల్ లో అద్భుత ఫీచర్.. ఎలా వాడాలో తెలుసా? సుందర్ పిచాయ్ చెబుతున్నారు వినండి..
గూగుల్ ఐ/ఓ కాన్ఫరెన్స్ లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కొత్త ఫీచర్లను పరిచయం చేశారు. జీమెయిల్ లో ‘హెల్ప్ మీ రైట్’ అనే ఫీచర్ ఏఐ ఆధారంగా పనిచేస్తుందన్నారు. దీంతో వినియోగదారులు ఈ మెయిల్ టైప్ చేసే పని ఉండదని, అదే అక్షరాలు, పదాలు, టెంప్లేట్స్ చూపిస్తుందని చెప్పారు.

గూగుల్ వార్షిక ఐ/ఓ కాన్ఫరెన్స్ లో ఎన్నో ఆసక్తి అంశాలున్నాయి. సరికొత్త ఉత్పత్తులను గూగుల్ ఆవిష్కరించింది. వాటిల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ను మరింత వినియోగించుకోనున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. కేవలం గూగుల్ సెర్చ్ ఇంజిన్ కు మాత్రమే కాక ఇతర అప్లికేషన్స్ లో కూడా ఏఐను తీసుకొస్తున్నట్లు చెప్పారు. జీ మెయిల్ లో ఈ-మెయిల్ డ్రాప్ట్ చేయడం, గూగుల్ ఫొటోల్లో ఫొటోలను మరింత కలర్ ఫుల్ గా మార్చేదుకు ఏఐని వాడినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
కాలిఫోర్నియాలోని మౌంట్ వ్యూ జరిగిన గూగుల్ ఐ/ఓ కాన్ఫరెన్స్ లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కొత్త ఫీచర్లను పరిచయం చేశారు. జీమెయిల్ లో ‘హెల్ప్ మీ రైట్’ అనే ఫీచర్ ఏఐ ఆధారంగా పనిచేస్తుందన్నారు. దీంతో వినియోగదారులు ఈ మెయిల్ టైప్ చేసే పని ఉండదని, అదే అక్షరాలు, పదాలు, టెంప్లేట్స్ చూపిస్తుందని చెప్పారు. ఇది వినియోగదారులకు పనిని సులభతరం చేయడంతో పాటు వేగంవంతం చేస్తుందన్నారు. ఒక సింపుల్ ఉదాహరణతో పిచాయ్ దీనిని వివరించారు. అదేంటంటే..
మీ ప్రయాణించాలనుకుంటున్న విమానం రద్దయితే..
జీమెయిల్ లోని ఏఐ ఆధారిత టూల్ ని సుందర్ పిచాయ్ ఒక ఒక ఉదాహరణతో వివరించారు. అదేంటంటే మీరు ప్రయాణించాలనుకుంటున్న విమానం రద్దయ్యింది. ఎయిర్ లైన్ సంస్థ ఈ విషయాన్ని మీకు మెయిల్ చేస్తూ ఓ ఓచర్ ను పంపింది. కానీ మీకు విమాన టికెట్ కు సంబంధించిన మొత్తం నగదు రిఫండ్ కావాలనుకోండి. అప్పుడు మీరు ఎయిర్ లైన్ సంస్థ రిప్లై ఇవ్వడానికి జీమెయిల్ లోని ఏఐ ఆధారిత ‘హెల్ప్ మీ రైట్’ ఫీచర్ ఉపయోగపడుతుందన్నారు.



మీకు కావాల్సిన మెయిల్ కు సంబంధించిన ప్రాంప్ట్ ను టైప్ చేస్తే చాలు మెయిల్ ఎలా పంపాలో అదే పూర్తిగా టైప్ చేసి పంపిస్తుందని చెప్పారు. అలాగే ఆ విమానానికి సంబంధించిన పూర్తి వివరాలు పాత మెయిల్ నుంచ కూడా కాపీ చేసుకుంటుందన్నారు. ఇది మీరు ఎయిర్ లైన్ సంస్థకు ఎలా మెయిల్ చేయాలనుకొంటున్నారో దానికి దగ్గరగానే ఉంటుంది. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మార్పులు మీరు చేసుకొని సెండ్ చేసుకోవచ్చని సుందర్ పిచాయ్ చెప్పారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..