Google Maps: గూగుల్‌ మ్యాప్‌ మిమ్మల్ని మోసం చేస్తోందా? ఈ భారతీయ యాప్‌ను ప్రయత్నించండి!

Google Maps: ఈ నావిగేషన్‌ యాప్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ 'నేవిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్' (నావిక్) ద్వారా పనిచేస్తుంది. మీరు గూగుల్‌..

Google Maps: గూగుల్‌ మ్యాప్‌ మిమ్మల్ని మోసం చేస్తోందా? ఈ భారతీయ యాప్‌ను ప్రయత్నించండి!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 06, 2024 | 8:26 PM

Mappls MapmyIndia Map: ఇటీవల జరిగిన ఒక విషాద సంఘటన గూగుల్‌ మ్యాప్‌ విశ్వసనీయతపై ప్రశ్నలను లేవనెత్తింది. గురుగ్రామ్ నుండి బరేలీకి వెళుతున్న కారు గూగుల్ మ్యాప్స్ ద్వారా మార్గాన్ని ఎంచుకుని, సగం నిర్మించిన వంతెనపైకి ఎక్కింది. దీని కారణంగా కారు రామగంగా నదిలో పడి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన గూగుల్ మ్యాప్స్ పూర్తిగా సురక్షితమైనదా? సరైన మార్గాన్ని చూపుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ విషయంలో భారతదేశ స్థానిక నావిగేషన్ యాప్‌లు మెరుగైనవని నిరూపించగలవా?

గూగుల్ మ్యాప్స్ ప్రజలకు తప్పుడు మార్గాన్ని చూపిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీంతో వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ఈ రోజుల్లో, ఎక్కడికైనా వెళ్లాలంటే నావిగేషన్ యాప్ చాలా అవసరం. అందుకే మనం గూగుల్‌ మ్యాప్స్‌పై మాత్రమే ఆధారపడాలా లేదా ఏదైనా భారతీయ నావిగేషన్ యాప్‌ని ఉపయోగించవచ్చా? మార్కెట్లో భారతీయ యాప్ ఉంది. ఇది మీకు మెరుగైన నావిగేషన్ సేవను అందిస్తుంది.

ఇండియన్ నావిగేషన్ యాప్:

భారతదేశంలోని ప్రముఖ నావిగేషన్ యాప్ ‘Mappls Mapmyindia’ యాప్ మీకు మెరుగైన నావిగేషన్ సేవను అందిస్తుంది. మీకు కావాలంటే మీరు గూగుల్‌ మ్యాప్స్‌కు బదులుగా ఈ యాప్‌ని ఉపయోగించవచ్చు. Maples MapIndia యాప్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం.

Mappls Mapmyindia భారతదేశ రోడ్లు, ట్రాఫిక్ గురించి మెరుగైన అవగాహన కలిగి ఉంది. భారతదేశంలో కొత్త హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మిస్తున్నారు. ఇది కాకుండా, స్థానిక రోడ్లు, వీధుల అభివృద్ధి తదితర వాటిపై అప్‌డేట్‌ ఇస్తుంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఈ యాప్ తన డేటాబేస్‌ను అప్‌డేట్ చేస్తూ ఉంటుంది.

స్థానిక భాషా మద్దతు: ఈ యాప్ అనేక భారతీయ భాషలలో పనిచేస్తుంది. ఇది భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఉపయోగించడం చాలా సులభం చేస్తుంది.

ఆఫ్‌లైన్ మ్యాప్స్: ఈ యాప్‌లో మీరు ఆఫ్‌లైన్ మ్యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా మీరు సులభంగా నావిగేట్ చేయవచ్చు.

ఈ యాప్ ప్రధాన రహదారి గురించి మాత్రమే కాకుండా చిన్న వీధులు, సందుల గురించి కూడా వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. ఈ యాప్‌ భారతీయ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. గుంతలు, రహదారి నిర్మాణ పనులు, టోల్ ప్లాజాలు, పెట్రోల్ పంపులు, ఏటీఎంలు ఈ యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

ఈ నావిగేషన్‌ యాప్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ‘నేవిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టెలేషన్’ (నావిక్) ద్వారా పనిచేస్తుంది. మీరు గూగుల్‌ మ్యాప్స్‌కు బదులుగా ఏదైనా ఇతర యాప్‌ని ఉపయోగించాలనుకుంటే రియల్ టైమ్ డేటా అప్‌డేట్‌ల ఫీచర్‌తో మీరు ఈ నావిగేషన్ యాప్‌ని ప్రయత్నించవచ్చు.

ఇది కూడా చదవండి: Indian Railways: హైపర్‌లూప్‌ రైలు.. విమానం కంటే స్పీడు.. గంటకు 1200 కి.మీ వేగం!

మరిన్ని టెక్ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి