Google: ఇకపై తెలుగులోనూ ‘జెమిని’.. మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్స్..
తాజాగా గూగుల్ నిర్వహించిన గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ 10వ ఎడిషన్ సందర్భంగా గురువారం ఈ ప్రకటన చేసింది. ప్రాంతీయ భాషాల్లో జెమిని ఏఐ సేవలతో పాటు మరికొన్ని కీలక ప్రకటనలు చేసింది గూగుల్. ప్రస్తుతం ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలు గురువారం నుంచి హిందీలోకి అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది...
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దూకుడు పెంచింది. జెమిని లైవ్ పేరుతో గూగుల్ తీసుకొచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెద్ద ఎత్తున ఆదరణ లభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న గూగుల్ జెమినినీ ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు.
తాజాగా గూగుల్ నిర్వహించిన గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ 10వ ఎడిషన్ సందర్భంగా గురువారం ఈ ప్రకటన చేసింది. ప్రాంతీయ భాషాల్లో జెమిని ఏఐ సేవలతో పాటు మరికొన్ని కీలక ప్రకటనలు చేసింది గూగుల్. ప్రస్తుతం ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలు గురువారం నుంచి హిందీలోకి అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. అలాగే.. తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ, గుజరాతీ, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు గూగుల్ ప్రకటించింది.
కాగా జెమిని ఏఐని ప్రస్తుతం 40 శాతం మంది వాయిస్ ఇన్‌పుట్ ద్వారా వినియోగిస్తున్నారని గూగుల్ తెలిపింది. గూగుల్ ఏఐ ఓవర్‌వ్యూ సదుపాయం హిందీ భాషలో అందుబాటులో ఉండగా.. బెంగాలీ, తెలుగు, మరాఠీ భాషలను జోడించినట్లు గూగుల్ పేర్కొంది. ఇక ఈ ఈవెంట్‌లో గూగుల్ మరికొన్ని కీలక ప్రకటనలు చేసింది. వీటిలో ప్రధానమైనవి. గూగుల్ మ్యాప్స్‌లో కొత్తగా రెండు రియల్ టైమ్ వాతావరణ అప్‌డేట్‌లు అందించారు. మంచు కురిసిన సమయంలో, వరదలు సంభవించిన సందర్భాల్లో ఈ అప్‌డేట్స్ వాహనదారులకు ఉపయోగపడతాయి.
దీంతో గూగుల్ పేలో యూపీఐ సర్కిల్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీంతో యూజర్లు తమ యూపీఐ అకౌంట్‌ను ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. అలాగే గూగుల్ పే ద్వారా రూ. 5 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకునే అవకాశాన్ని కల్పించారు. అంతేకాకుండా తమ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.50 లక్షల వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చని గూగుల్ పేర్కొంది. ఇందుకోసం గూగుల్ ముత్తూట్ ఫైనాన్స్‌తో జట్టు కట్టింది. అలాగే.. గూగుల్ మ్యాప్స్‌లోని 170 మిలియన్ల ఫేక్ రివ్యూలను ఏఐ సాయంతో తొలగించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..