BSNL Plans: బీఎస్‌ఎన్‌ఎల్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్… ఆ రీచార్జ్ ప్లాన్ గడువు పెంపు
ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్ రూ.151 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును పెంచింది. మహమ్మారి సమయంలో తమ ఇళ్ల నుండి పని చేస్తున్న వ్యక్తుల కోసం డేటా బూస్టర్‌గా ఈ ప్లాన్ ప్రవేశపెట్టింది. 2020లో దీనిని ప్రవేశపెట్టినప్పుడు బీఎస్‌ఎన్ 30 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌ను అందించింది. అయితే 2022లో ఈ వ్యాలిడిటీను సవరిస్తూ 28 పరిమితం చేసింది. అయితే తాజాగా ఈ ప్లాన్ వ్యాలిడిటీ మళ్లీ పెంచింది.

ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) మారమూల ప్రాంతాలకు కూడా సర్వీస్ అందించే ఏకైక ఆపరేటర్‌గా నిలిచింది. దీంతో భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లోని వారు బీఎస్‌ఎన్‌ఎల్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. టెలికాం రంగంలో పోటీను తట్టుకునేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ఎప్పటికప్పుడు సరికొత్త రీచార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తూ ఉంటుంది. ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్ రూ.151 ప్రీపెయిడ్ ప్లాన్ చెల్లుబాటును పెంచింది. మహమ్మారి సమయంలో తమ ఇళ్ల నుండి పని చేస్తున్న వ్యక్తుల కోసం డేటా బూస్టర్‌గా ఈ ప్లాన్ ప్రవేశపెట్టింది. 2020లో దీనిని ప్రవేశపెట్టినప్పుడు బీఎస్‌ఎన్ 30 రోజుల చెల్లుబాటుతో ప్లాన్‌ను అందించింది. అయితే 2022లో ఈ వ్యాలిడిటీను సవరిస్తూ 28 పరిమితం చేసింది. అయితే తాజాగా ఈ ప్లాన్ వ్యాలిడిటీ మళ్లీ పెంచింది. బీఎస్‌ఎన్‌ఎల్ రూ.151 ప్లాన్ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.
బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 151 ప్లాన్
బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి రూ.151 ప్లాన్ డేటా వోచర్‌గా మారింది. కాబట్టి ఈ ప్లాన్ పని చేయాలంటే మాత్రం యాక్టివ్ బేస్ ప్రీపెయిడ్ ప్లాన్ అవసరం. రూ.151 ప్లాన్ ఇప్పటికీ 40 జీబీ మొత్తం డేటాను అందిస్తోంది. తాజాగా ఈ ప్లాన్ వ్యాలిడిటీను 2 రోజులు పెంచారు. అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులకు చేరింది. అయితే ఈ తాజాగా మార్పు తమిళనాడు సర్కిల్ వినియోగదారులకు ప్రతిబింబిస్తుంది. కానీ ఇతర సర్కిల్‌లకు ఈ ప్లాన్ ఇప్పటికీ 28 రోజులు మాత్రమే అందిస్తుననారు. ఈ ప్లాన్‌లో డేటాతో పాటు జింగ్‌కు ఉచిత సభ్యత్వం ఉంది.
ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో ఇతర ప్రయోజనాలు ఏవీ లేవు. ఇది డేటా వోచర్ కాబట్టి చెల్లుబాటులో ఈ మార్పుతో ప్లాన్‌ని ఉపయోగించేందుకు రోజువారీ ఖర్చు రూ. 5.033 అవుతుంది. అలాగే ప్రతి 1జీబీ డేటాను వినియోగించే ఖర్చు రూ. 3.77 అవుతుంది. ప్రతిరోజూ కేవలం 1 జీబీ లేదా 2 జీబీ డేటాను ఉపయోగించడాన్ని పరిమితం చేయకూడదనుకునే ఎవరికైనా ఇది అద్భుతమైన వోచర్. ఇది లంప్సమ్ డేటా కాబట్టి వినియోగదారులు కావాలనుకుంటే డేటానంతా ఒకేసారి ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ డేటా అవసరమైతే మళ్లీ రీఛార్జ్ చేసుకోవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



