AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Tips: వీటిని మాత్రం సెకండ్ హ్యాండ్‌లో కొనొద్దు.. లిస్ట్‌లో స్మార్ట్ గ్యాడ్జెట్లు..

అన్ని వస్తువులను సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని టెక్ గ్యాడ్జెట్లను సెకండ్ హ్యాండ్ వి కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. వాటి వల్ల లాభమేమో గానీ నష్టమైతే తప్పదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ లో కొనకూడదని గ్యాడ్జెట్లు ఏంటి? వాటిని ఎందుకు అలా కొనుగోలు చేయకూడదు? పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

Tech Tips: వీటిని మాత్రం సెకండ్ హ్యాండ్‌లో కొనొద్దు.. లిస్ట్‌లో స్మార్ట్ గ్యాడ్జెట్లు..
Buying Second Hand Gadgets
Madhu
| Edited By: |

Updated on: Jan 17, 2024 | 1:30 PM

Share

ఇటీవల కాలంలో సెకండ్ హ్యాండ్ వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. అధిక ధర పెట్టి కొత్త వస్తువులను కొనుగోలు చేయలేని వారు చవకగా లభిస్తాయని యూజ్డ్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. కార్లు, బైక్లు, సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, గృహోపకరణాలు ఇలా ఒకటేమిటి అన్ని సెకండ్ హ్యాండ్లో లభ్యమవుతున్నాయి. వాటిని అధిక సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు కూడా. అయితే అన్ని వస్తువులను సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని టెక్ గ్యాడ్జెట్లను సెకండ్ హ్యాండ్ వి కొనుగోలు చేయకూడదని చెబుతున్నారు. వాటి వల్ల లాభమేమో గానీ నష్టమైతే తప్పదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెకండ్ హ్యాండ్ లో కొనకూడదని గ్యాడ్జెట్లు ఏంటి? వాటిని ఎందుకు అలా కొనుగోలు చేయకూడదు? పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..

స్మార్ట్ హోమ్ పరికరాలు..

ఇటీవల కాలంలో అన్ని వస్తువులు స్మార్ట్ అయిపోతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోన్, మణికట్టుకు స్మార్ట్ వాచ్ తో పాటు ఇంట్లో వాడే డోర్ బెల్స్, పలు అసిస్టెంట్లు అన్ని అత్యాధునిక సాంకేతికతతో వస్తున్నాయి. అయితే కొన్ని స్మార్ట్ గృహోపకరణాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సెకండ్ హ్యాండ్ లో కొనుగోలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డోర్ బెల్స్, స్మార్ట్ అసిస్టెంట్స్ ముందుగా హ్యాక్ చేసే దానిని మీరు కొనుగోలు చేసి ఇంట్లో అమర్చగానే వారు మీ ఇంటిని యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఆ పరికరాలను రీసెట్ చేసినా.. దానిలో పెట్టిన బగ్ తొలగదని చెబుతున్నారు. ఇది మీ ప్రైవసీ దెబ్బతీస్తుంది.

బేబీ మానిటర్లు..

ఇటీవల కాలంలో బేబి మానిటర్లు ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. తల్లిదండ్రులు వేరే పనుల్లో బిజీగా ఉన్న సమయంలో పిల్లలను ఓ కంట చూస్తూ ఉండటానికి పిల్లల ఎదుంట ఓ కెమెరా కలిగిన టాయ్ ను ఉంచుతున్నారు. దీనినే బేబి మానిటర్ అని పిలుస్తున్నారు. వీటిని కూడా సెకండ్ హ్యాండ్లో కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే మీ పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం ఇతరులు తెలసుకునే వీలుంది.

ఇయర్‌బడ్స్,హెడ్‌ఫోన్‌లు..

హెడ్ ఫోన్లు, ఇయర్ బడ్స్ వేరే వారు వాడినవి మళ్లీ కొనుగోలు చేసి వాడటం అంత మంచిది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి వాడిన ఈ ఇయర్ బడ్స్ అతని చెమటతో తడిసే అవకాశం ఉంటుంది. దానిలో బ్యాక్టిరియా, క్రిములు ఉండే అవకాశం ఉంటుంది. అవి సంతానోత్పత్తిని చేసి మీకు రోగాలను కలుగు జేయొచ్చు. వీటిని ఎంత శుభ్రం చేసినా.. ఎంతలా శానిటైజ్ చేసినా అది పూర్తిగా శుభ్రపడిందన్న గ్యారంటీ ఉండదు.

ఎలక్ట్రిక్ టూత్ బ్రష్..

నోరు ఒక క్రిముల పుట్ట. దానిని ప్రతి శుభ్రం చేస్తేనే ఒక రకంగా ఉంటుంది. అదే లేకపోతే తీవ్ర దుర్వాసన కొడుతుంది. అలాంటి నోటిని శుభ్రపరించేందుకు ఇటీవల ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ లను వినియోగిస్తున్నారు. అయితే వీటిని కూడా సెకండ్ హ్యాండ్ లో అసలు కొనుగోలు చేయొద్దు. వాటిలో క్రిములు చేరే అవకాశం ఉంది. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది.

హెయిర్ రిమూవర్స్..

ఇతరులు ఉపయోగించే రేజర్‌లు, ట్రిమ్మర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సెకండ్ హ్యాండ్ కొనకూడదు. ఇవి కూడా ఇన్‌ఫెక్షన్‌లను పెంచే వాహకాలుగా మారే అవకాశం ఉంది. అందుకే వ్యక్తిగత సాధనాలు ఏమైనా కొత్తవాటినే వినియోగడం ఉత్తమం.

పవర్ బ్యాంకులు..

ఇటీవల కాలంలో పవర్ బ్యాంకుల అవసరం పెరిగింది. ఎక్కువ మంది వీటిని వినియోగిస్తున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ పవర్ బ్యాంకులు ఎప్పుడూ ఆమోద యోగ్యం కాదు. దీనిలో బ్యాటరీలు వీక్ అయిపోయే అవకాశం ఉంది. అవి మీ భద్రతకు హానికరం. అలాగే బ్యాటరీ బాగా వేడెక్కడం, అది మరీ తీవ్రమైతే పేలిపోయే ప్రమాదం పొంచి ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
బ్యాటర్లు వచ్చారు..వెళ్ళారు..అంతే..109 ఓవర్లకే 30 వికెట్లా?
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..