AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram Account: ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను డీయాక్టివేట్‌ చేయాలా? ఈ టిప్స్‌ పాటిస్తే సరి

ఇన్‌స్టాగ్రామ్‌ ఇటీవల కాలంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ముఖ్యంగా ఇన్‌స్టా రీల్స్ యువతను ఎక్కువగా ఆకట్టకుంటున్నాయి. అయితే అనుకోని పరిస్థితుల్లో మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకుంటే ఆ ఖాతాను ఎలా డీయాక్టివేట్‌ చేయడం చాలా మందికి తెలియదు. సింపుల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు.

Instagram Account: ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను డీయాక్టివేట్‌ చేయాలా? ఈ టిప్స్‌ పాటిస్తే సరి
Instagram Feature
Nikhil
| Edited By: |

Updated on: Jan 17, 2024 | 9:45 AM

Share

ఆధునిక డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ ఉనికిని నిర్వహించడం చాలా ముఖ్యం. అయితే కొన్ని సార్లు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌తో దూరంగా ఉండడం అవసరం.ఇన్‌స్టాగ్రామ్‌ ఇటీవల కాలంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ముఖ్యంగా ఇన్‌స్టా రీల్స్ యువతను ఎక్కువగా ఆకట్టకుంటున్నాయి. అయితే అనుకోని పరిస్థితుల్లో మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు వీడ్కోలు చెప్పాలని నిర్ణయించుకుంటే ఆ ఖాతాను ఎలా డీయాక్టివేట్‌ చేయడం చాలా మందికి తెలియదు. సింపుల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని టిప్స్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను ఎలా డియాక్ట్‌వేట్‌ చేయాలో? కొన్ని టిప్స్‌ పాటించి 

మొబైల్ నుంచి డియాక్టివేట్‌ ఇలా

  • మీ ఆండ్రాయిడ్‌ లేదా ఐఓఎస్‌ పరికరంలో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను తెరవండి.
  • మీ ప్రొఫైల్‌కి వెళ్లడానికి దిగువ కుడివైపున ఉన్న మీ ప్రొఫైల్ చిత్రాన్ని ఎంచుకోవాలి.
  • ఇప్పుడు కుడి ఎగువ మూలలో ఉన్న మూడు లైన్స్‌ను ఎంచుకోవాలి. 
  • సెట్టింగ్‌లు, గోప్యత ఎంపికను ఎంచుకుని, అకౌంట్స్ సెంటర్ ఎంపికను తీసుకోవాలి.
  • వ్యక్తిగత వివరాలను ఎంచుకోవాలి.
  • ఖాతా యాజమాన్యం, నియంత్రణ ఎంపికను ఎంచుకుని, క్రియారహితం లేదా తొలగింపును నొక్కాలి. 
  • అనంతరం మీరు శాశ్వతంగా తొలగించాలనుకుంటున్న లేదా తాత్కాలికంగా డియాక్టివేట్ చేయాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోవాలి.
  • మీరు మీ ఖాతాతో ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. తొలగించండి లేదా నిష్క్రియం చేయండి అనే ఎంపికను ఎంచుకోవాల్సి ఉంటుంది. 

కంప్యూటర్ నుంచి తొలగించడం ఇలా

  • ఏదైనా వెబ్ బ్రౌజర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెరవాలి. అనంతరం మీ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. 
  • మీ ఖాతా తెరిచిన తర్వాత దిగువ ఎడమ మూలలో ఉన్న మూడు లైన్స్‌ను ఎంచుకోవాలి.
  • అనంతరం సెట్టింగ్‌లపై క్లిక్ చేయాలి. ఖాతాలను ఎంచుకుని, ఆపై వ్యక్తిగత వివరాల ఎంపికను ఎంచుకోవాలి. 
  • ఖాతా యాజమాన్యం, నియంత్రణను క్లిక్ చేయాలి. 
  • అనంతరం డియాక్టివేషన్ లేదా తొలగింపును ఎంచుకోవాలి. మీరు తొలగించాలనుకుంటున్న లేదా డియాక్టివేట్ చేయాలనుకుంటున్న ఖాతాను సెలెక్ట్‌ చేసుకోవాలి. 
  • మీరు మీ ఖాతాతో ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి. తొలగించండి లేదా నిష్క్రియం చేయండి. లేదా కొనసాగించు ఎంచుకుంటే ఖాతా డీయాక్టివేట్‌ అవుతుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..