- Telugu News Photo Gallery Technology photos Amazon great republic day sale best smartphone under 15k check here for best deals
Republic day sale: కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 15వేలలోనే బెస్ట్ ఫోన్స్
ప్రస్తుతం పండగ సీజన్‌ను పురస్కరించుకొని మార్కెట్లోకి కొంగొత్త స్మార్ట్‌ఫోన్‌లు సందడి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇక తాజాగా రిపబ్లిక్ డే సేల్ పేరుతో అమెజాన్ ఊహకందని ఆఫర్లను ప్రకటించింది. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా రూ. 15 వేలలో లభిస్తున్న కొన్ని బెస్ట్ స్మార్ట్ ఫోన్స్, వాటి ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Jan 22, 2024 | 5:37 PM

రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ పేరుతో ఆఫర్లను అందిస్తోంది. ఈ నెల 13న ప్రారంభమైన ఈ సేల్ 18వ తేదీ వరకు కొనసాగనుంది. సేల్‌లో భాగంగా కొన్ని ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఇందులో భాగంగా రూ. 15,000 లోపు లభిస్తున్న కొన్ని బెస్ట్ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి.

ఐకూ జెడ్6 లైట్ 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 19,999కాగా సేల్ భాగంగా రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.58 ఇంచెస్‌తో కూడిన 120Hz IPS LCD డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ 4 Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరా, 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఐకూ జెడ్7ఎస్ 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 23,999కాగా ఆఫర్‌లో భాగంగా రూ. 14,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.38 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే 64 ఎంపీ రెయిర్ కెమెరాతో పాటు 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక ఈ సేల్‌లో భాగంగా రూ. 15 వేల లోపు లభిస్తున్న మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్‌మీ నార్జో 60 ఎక్స్ 5జీ ఫోన్. ఈ ఫోన్ అసలు ధర రూ. 17,999కాగా సేల్‌లో భాగంగా రూ. 12,999కి సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.72 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ కెమెరాను అందించారు. కెమెరా విషయానికొస్తే 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక సేల్‌లో భాగంగా రూ. 15 వేలలో లభిస్తున్న మరో స్మార్ట్ ఫోన్ రియల్ మీ12 5జీ ఫోన్. ఈ ఫోన్ అసలు ధర రూ. 17,999కాగా సేల్‌లో భాగంగా రూ. 12,999కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఎమెరా విషయానికొస్తే 50 ఎంపీతో కూడిన రెయిర్ కెమెరా, సెల్ఫీల కోసం 8 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.




