Aadhaar cloning: ఆధార్ క్లోనింగ్‌తో కోట్లు కొల్లగొడుతోన్న కేటుగాళ్లు.. ఇలా ప్రొటెక్ట్ చేసుకోండి..
తాజాగా ఆధార్ క్లోనింగ్ అనే కొత్త రకం మోసాలు జరుగుతున్నాయి. వేలి ముద్రలను తస్కరించి, బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులను కాజేస్తున్నారు. క్లోన్డ్ వేలిముద్రలు తయారు చేసి ఆధార్ ఎనేబుల్డ్ పేమేంట్ సిస్టం ద్వారా డబ్బులు కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ప్రతీ చిన్న పనికి ఆధార్ కార్డ్ అనివార్యంగా మారిన నేపథ్యంలో ఆధార్ కార్డ్‌తో పాటు ఫింగర్ ప్రింట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. దీంతో కొందరు మోసగాళ్లు ఫింగర్ ప్రింట్స్‌ను సేకరించి, నగదును..

టెక్నాలజీ ఎంతలా అభివృద్ధి చెందుతుంతో అదే స్థాయిలో సైబర్ నేరాలు సైతం పెరిగిపోతున్నాయి. మారుతోన్న టెక్నాలజీని తమకు అనుగుణంగా మార్చుకుంటూ కొందరు కేటుగాళ్లు కోట్లు కొల్లగొడుతున్నారు. రకరకాల మార్గాల్లో డబ్బులను కాజేస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రజలు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా.. సైబర్ నేరాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా ఆధార్ క్లోనింగ్ అనే కొత్త రకం మోసాలు జరుగుతున్నాయి. వేలి ముద్రలను తస్కరించి, బ్యాంక్ అకౌంట్‌లోని డబ్బులను కాజేస్తున్నారు. క్లోన్డ్ వేలిముద్రలు తయారు చేసి ఆధార్ ఎనేబుల్డ్ పేమేంట్ సిస్టం ద్వారా డబ్బులు కొట్టేస్తున్నారు. ప్రస్తుతం ప్రతీ చిన్న పనికి ఆధార్ కార్డ్ అనివార్యంగా మారిన నేపథ్యంలో ఆధార్ కార్డ్‌తో పాటు ఫింగర్ ప్రింట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. దీంతో కొందరు మోసగాళ్లు ఫింగర్ ప్రింట్స్‌ను సేకరించి, నగదును దోచేస్తున్నారు. మరి మీరు ఇలాంటి మోసాల బారినపడకూడదంటే.. ఆధార్ కార్డులోని వేలి ముద్రలు, ఇతర బయోమెట్రిక్ డేటాను లాక్ చేయడం ద్వారా దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు. ఇంతకీ బయోమెట్రిక్ లాకింగ్ ఎలా చేసుకోవాలి.? అన్‌లాక్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బయోమెట్రిక్ లాకింగ్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి..
* ఇందుకోసం ముందుగా మై ఆధార్ పోర్టల్‌లోకి వెళ్లి ఆధార్ నంబర్ నమోదు చేయాలి.
* అనంతరం మైఆధార్ పోర్టల్‌లోకి ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి.
* స్క్రీన్ పై లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* ప్లీజ్ సెలెక్ట్ టూ లాక్ ఓపెన్ అవుతుంది. అనంతరం టర్మ్స్ బాక్స్‌లో టిక్ చేసి నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి.
* అనంతరం బయోమెట్రిక్ లాక్ కాగానే.. ‘యూవర్ బయోమెట్రిక్ హావ్ బీన్ లాక్డ్ సక్సెస్‌ఫుల్లీ’ అనే మెసేజ్ వస్తుంది.
* బయోమెట్రిక్ లాక్ కాగానే.. బయో మెట్రిక్ ఆప్షన్ లో ఎరుపు రంగు లాక్ స్క్రీన్‌పై కనబడుతుంది.
అన్‌లాక్ ఎలా చేసుకోవాలంటే..
* ఆధార్ బయోమెట్రిక్ అన్‌లాక్ చేసుకోవాలంటే ముందుగా పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. వెంటనే.. లాక్/ అన్‌లాక్ బయోమెట్రిక్ ఆప్షన్ ఎరుపు రంగులో నిపిస్తుంది. బయోమెట్రిక్ లాక్ అయితే ఇలా కనిపిస్తుంది.
* అన్‌లాక్ ప్రక్రియ కోసం ‘ప్లీజ్ సెలక్ట్ టూ లాక్’ టిక్ చేసిన తర్వాత రెండు ఆప్షన్లు కనిపిస్తాయి.
* బయోమెట్రిక్ అన్‌లాక్ టెంపరరీ లేదా పర్మినెంట్ అనే మెసేజ్ కనిపిస్తుంది. మీకు కావాల్సిన ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి.
* వెంటనే బయోమెట్రిక్ హావ్ బీన్ అన్‌లాక్డ్ సక్సెస్‌ఫుల్లీ అనే మెసేజ్ కనిపిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..