AC: ఏసీ వాడినా కరెంట్ బిల్‌ తక్కువ రావాలా.? ఈ సింపుల్ టిప్స్‌ ఫాలో అవ్వండి..

ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 కాగానే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో చాలా మంది ఏసీ ఉపయోగిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీలు ఉపయోగించే పరిస్థితి వచ్చింది. దీంతో సహజంగానే కరెంట్‌ బిల్లు వాచిపోతుంది. ఏసీల వాడకం వల్ల కరెంట్‌ బిల్‌లో ఓ రేంజ్‌లో వస్తుందని తెలిసిందే. అయితే కొన్ని రకాల సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా...

AC: ఏసీ వాడినా కరెంట్ బిల్‌ తక్కువ రావాలా.? ఈ సింపుల్ టిప్స్‌ ఫాలో అవ్వండి..
Ac Using
Follow us

|

Updated on: Apr 02, 2024 | 2:11 PM

ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 కాగానే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. దీంతో చాలా మంది ఏసీ ఉపయోగిస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీలు ఉపయోగించే పరిస్థితి వచ్చింది. దీంతో సహజంగానే కరెంట్‌ బిల్లు వాచిపోతుంది. ఏసీల వాడకం వల్ల కరెంట్‌ బిల్‌లో ఓ రేంజ్‌లో వస్తుందని తెలిసిందే. అయితే కొన్ని రకాల సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా కరెంట్ బిల్లు తక్కువగా వస్తుంది. ఇంతకీ కరెంట్ బిల్లు తక్కువ రావడానికి ఉపయోగపడే టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

* ఏసీలో ఎంత తక్కువ టెంపరేచర్ సెట్‌ చేసుకుంటే అంత ఎక్కువగా కూల్‌ అవుతుందని చాలా మంది భావిస్తుంటారు కానీ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషెన్సీ ప్రకారం 24 డిగ్రీలు హ్యూమన్ బాడీకి ఐడల్ టెంపరేచర్‌గా చెబుతుంటారు. 24 డిగ్రీలకు టెంపరేచర్‌ను సెట్ చేసుకోవడం వల్ల గది చల్లబడడమే కాకుండా, మిషన్‌పై తక్కువ లోడ్‌ పడుతుంది. అంతేకాకుండా కరెంట్ బిల్‌ కూడా తక్కువ వస్తుంది.

* ఏసీలను ఎప్పికప్పుడు సర్వీసింగ్ చేయడం వల్ల కూడా తక్కువ కరెంట్‌ బిల్‌ వస్తుంది. అయితే మనలో చాలా మంది ఏసీ పనిచేయడం ఆగిపోయిన తర్వాతే రిపేర్‌ చేయిస్తుంటారు. అలా కాకుండా అప్పుడప్పుడు ఏసీ మెయింటెనెన్స్‌ చేస్తుండాలి.

* ఏసీలు ఉపయోగించే సమయంలో గది తలుపులు, కిటికీలు పూర్తిగా మూసి ఉండేలా చూసుకోవాలి. గదిలోపలి గాలి బయటకు లీక్‌ కాకుండా చూసుకోవాలి. దీనివల్ల తక్కువ సమయలోనే గది చల్లగా మారుతుంది. ఇది కరెంట్ బిల్లు తక్కువ రావడానికి ఉపయోగపడుతుంది.

* ఇక కాసేపు ఏసీ ఆన్‌ చేసిన తర్వాత గదిలో తక్కువ స్పీడ్‌తో ఫ్యాన్‌ ఆన్‌ చేస్తే గదంతా కూల్‌గా మారుతుంది. ఆ సమయంలో ఏసీ ఆఫ్‌ చేస్తే సరిపోతుంది. దీంతో కరెంట్ భారం తగ్గుతుంది.

* రాత్రుళ్లు ఏసీ ఉపయోగించే సమయంలో టైమర్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. దీనివల్ల పడుకున్న కాసేపటికే ఏసీ ఆఫ్‌ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. దీంతో కరెంట్ బిల్‌ తక్కువగా వస్తుంది.

* ఇక ఏసీ కొనుగోలు చేసే సమయంలో కూడా 4-5 స్టార్‌ రేటింగ్‌ ఉండే వాటిని కొనుగోలు చేయాలి. దీనివల్ల కరెంట్ బిల్‌ తక్కువగా వస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్