Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ సేల్ ఈరోజే లాస్ట్! ఈ డీల్స్ మిస్ అవ్వకండి!
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈ రోజుతో ముగియనుంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్స్ పై మంచి డిస్కౌంట్స్ ఉన్నాయి.మొబైల్స్, టీవీలు కొనాలనుకునేవారికి ఇదే బెస్ట్ టైం. సేల్ డిస్కౌంట్ తో పాటు బ్యాంక్, క్రెడిట్ కార్డు ఆఫర్స్ కూడా ఉన్నాయి మరి లాస్ట్ మినిట్ లో బెస్ట్ డీల్స్ పై ఓ లుక్కేయండి!

ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సేల్ ఈరోజు రాత్రితో ముగుస్తుంది. రేపట్నుంచి ఆఫర్‌లు, డిస్కౌంట్‌లు ఉండవు. ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ టాప్స్, టీవీలు తీసుకోవాలనుకునేవాళ్లు చివరి నిముషంలో ఒకసారి చెక్ చేయండి. డిస్కౌంట్‌లతో పాటు బ్యాంక్ ఆఫర్లు కూడా కలుపుకుని మీకు మంచి డీల్ అనిపిస్తే ప్రొడక్ట్ కొనుగోలు చేయొచ్చు. టీవీలు, మొబైల్స్, ల్యాప్ టాప్స్ పై ఉన్న బెస్ట్ ఆఫర్స్ ఒకసారి చూద్దాం.
స్మార్ట్ ఫోన్స్
ఐఫోన్ తీసుకోవాలనుకునే వారికి ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ మోడల్స్ పై మంచి డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సేల్ లో ఐఫోన్16.. అన్ని ఆఫర్లతో కలిపి రూ.53,999 కి అందుబాటులో ఉంది. అలాగే ఐఫోన్ 16 ప్రో రూ.77,999 కు లభిస్తుంది. అలాగే ఈ సేల్‌లో వన్‌ప్లస్ 13 ఆర్ మొబైల్.. బ్యాంక్ ఆఫర్‌తో కలుపుకుని రూ. 38 వేలకు లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఎఫ్‌ఈ మొబైల్ రూ. 30 వేలకు అందుబాటులో ఉంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎఫ్17 5జీ.. రూ. 14,499 కి, నథింగ్ సీఎంఎఫ్ 2 ప్రో రూ. 15,999 కి, ఐకూ జెడ్ 10 ఎక్స్ రూ. 13,499కి, మోటరోలా జీ86 పవర్ 5జీ రూ. 15,999కి, రియల్ మీ 13 5జీ రూ.14,990 కి అందుబాటులో ఉన్నాయి.
స్మార్ట్ టీవీలు
ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో టీవీలపై మంచి డిస్కౌంట్ లభిస్తుంది. శాంసంగ్ 32 ఇంచెస్ స్మార్ట్ టైజెన్ టీవీ అత్యంత తక్కువ ధరకు( రూ. 22,900) కు లభిస్తుంది. అలాగే వన్‌ప్లస్ 32 ఇంచ్ ఎల్‌ఈడీ టీవీ రూ.21,999 కి, రియల్ మీ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ రూ.4,999కి లభిస్తున్నాయి. వీటితోపాటు కాస్ట్లీ టీవీలపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి.
ల్యాప్ టాప్స్
ఇకపోతే ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ల్యాప్ టాప్స్ పై కూడా మంచి డీల్స్ ఉన్నాయి. ఇందులో ఏసర్ అస్పైర్ 7ల్యాప్‌టాప్.. 51,999 కి లభిస్తుంది. అలాగే లెనోవో ఎల్ఓక్యూ ల్యాప్‌టాప్ రూ. 58,990 కి , యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్ ఎం2 రూ.67,990 కి, హెచ్ పీ 15 ల్యాప్‌టాప్ రూ.35,990 కి లభిస్తున్నాయి.
ఇవి కూడా..
ఇక వీటితోపాటు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బ్రాండెస్ ఏసీలు రూ.20 వేల నుంచి లభిస్తున్నాయి. సింగిల్ డోర్ ఫ్రిజ్ లు లు రూ.12 వేల నుంచి, డబుల్ డోర్ ఫ్రిజ్‌లు రూ.23 వేల నుంచి మొదలవుతున్నాయి. ఇంకా హెడ్ ఫోన్స్, అడాప్టర్స్, కంప్యూటర్ యాక్ససరీస్, మైక్రో ఓవెన్స్, వాషింగ్ మెషీన్స్, స్మార్ట్ వాచీలు.. ఇలా అన్ని రకాల ప్రొడక్ట్స్ పై డిస్కౌంట్స్ ఉన్నాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




