Jio phone 5g: జియో 5జీ ఫోన్ ఎలా ఉండనుందో తెలుసా.? ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..
టెలికం రంగంలో సరికొత్త విప్లవంలా దూసుకొచ్చింది రిలయన్స్ జియో. 4జీ నెట్‌వర్క్‌ను తక్కువ ధరకు అందించి కొత్త చరిత్ర సృష్టించింది. ఇదే క్రమంలో హ్యాండ్‌సెట్లను కూడా విడుదల చేస్తూ వస్తోంది జియో. ఇప్పటికే 3జీ, 4జీ ఫోన్‌ను లాంచ్ చేసిన జియో తాజాగా 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. త్వరలోనే జియో నుంచి 5జీ ఫోన్‌ను తీసుకురానున్నట్లు..
టెలికం రంగంలో సరికొత్త విప్లవంలా దూసుకొచ్చింది రిలయన్స్ జియో. 4జీ నెట్‌వర్క్‌ను తక్కువ ధరకు అందించి కొత్త చరిత్ర సృష్టించింది. ఇదే క్రమంలో హ్యాండ్‌సెట్లను కూడా విడుదల చేస్తూ వస్తోంది జియో. ఇప్పటికే 3జీ, 4జీ ఫోన్‌ను లాంచ్ చేసిన జియో తాజాగా 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. త్వరలోనే జియో నుంచి 5జీ ఫోన్‌ను తీసుకురానున్నట్లు రిలయన్స్ ఇప్పటికే ప్రకటించింది. దీపావళి లేదా ఈ ఏడాది చివర్లో జియో 5జీ ఫోన్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రిలయన్స్ మాత్రం ఇప్పటి వరకు ఈ 5జీ ఫోన్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. అయితే తాజాగా 5జీ ఫోన్ ఫీచర్లు ఇవేనంటూ కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్ వేదికగా జియో 5జీ ఫోన్ ఫొటోలతో పాటు, ఫీచర్లు, ధరకు సంబంధించిన వివరాలు చెక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ జియో ఫోన్ చూడడానికి ఎలా ఉండనుంది.? ఫీచర్లు ఏంటి.? లాంటి వివరాలు మీకోసం.. నెట్టింట వైరల్ అవుతోన్న సమాచారం మేరకు జియో 5జీ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంటట్ కెమెరా ఉండనుంది.
ఇందులో స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. 6.5 ఇంచెస్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇవ్వనున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 18 W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ధర విషయానికొస్తే ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ధర రూ. 8 నుంచి రూ. 12 వేల మధ్య ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే..
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..