AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Network Problems: వర్షాకాలంలో మీ ఫోన్‌ ఊరికే సతాయిస్తుందా.. ఈ సింపుల్‌ టిక్స్‌తో ఈజీగా సాల్వ్‌ చేసుకోండి!

వర్షా కాలం చాలా మందికి ఉపశమనం కలిగించవచ్చు, కానీ ఎక్కువగా మొబైల్, డేటా యూజ్‌ చేసే వారికి మాత్రం పిచ్చ చిరాకు. ఎందుకంటే.. వర్షా కాలంలో తరచూ నెట్‌వర్క్‌ సమస్యలు వస్తూ ఉంటాయి. దీని వల్ల చాలా మంది పనిని లేదా ముఖ్యమైన కమ్యూనికేషన్‌ను కోల్పోతారు. అలాంటి సందర్భంలో ఈ సమస్యను త్వరగా క్లియర్ చేసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు మీరు ఈ టిప్స్‌ను పాటించడం మీకు ఉత్తమంగా ఉంటుంది. అవును ఈ టిప్స్‌ను ఉపయోగిస్తే.. మీరు వర్షాకాలంలో కూడా మంచి నెట్‌వర్క్‌ను పొందవచ్చు. ఇంతకు ఆ టిప్స్ ఏంటో తెలుసుకుందాం పదండి.

Network Problems: వర్షాకాలంలో మీ ఫోన్‌ ఊరికే సతాయిస్తుందా.. ఈ సింపుల్‌ టిక్స్‌తో ఈజీగా సాల్వ్‌ చేసుకోండి!
Network Problems In Rainy S
Anand T
|

Updated on: Aug 28, 2025 | 4:39 PM

Share

వర్షా కాలం చాలా మందికి ఉపశమనం కలిగించవచ్చు, కానీ ఎక్కువగా మొబైల్, డేటా యూజ్‌ చేసే వారికి మాత్రం పిచ్చ చిరాకు. ఎందుకంటే.. వర్షా కాలంలో తరచూ నెట్‌వర్క్‌ సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిని అదిగమించేందుకు మనం ఈ టీప్స్‌ను వాడీ ఈజీగా నెట్‌వర్క్‌ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ముందుగా, మీ ఫోన్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లను చెక్‌ చేయండి. కొన్నిసార్లు, మీ ఫోన్ 4G లేదా 5Gకి ఆటోమేటిక్‌గా మారడానికి బదులుగా 2G లేదా 3Gలోనే ఆగిపోవచ్చు. కాబట్టి సెట్టింగ్‌లకు వెళ్లి మొబైల్ నెట్‌వర్క్‌లో 4G లేదా 5Gని సెట్‌ చేయండి. దీంతో మీకు సిగ్నల్ అందే అవకాశాలు మెరుగుపడవచ్చు. అయినా కూడా సిగ్నల్‌ పెరగకపోతే మీ ఫోన్ “నెట్‌వర్క్ మోడ్”ని “ఆటోమేటిక్”కి సెట్ చేయండి. దీని వల్ల మీ ఫోన్ దగ్గర్లో ఉన్న బెస్ట్‌ నెట్‌వర్క్‌కు కనెక్ట్‌ అవుతుంది.

ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేసి, ఆపై ఆఫ్ చేయండి

మీ ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేకపోతే ఒకసారి మీఫోన్‌లోని ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేసి, 10-15 సెకన్లు వేచి ఉండి, ఆ తర్వాత దాన్ని ఆఫ్ చేయండి. ఇది మీ ఫోన్ నెట్‌వర్క్ కనెక్షన్‌ను రీసెట్ చేస్తుంది. అంతేకాకుండా సమీపంలోని టవర్‌కి కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఈ సాధారణ ట్రిక్ తరచుగా తక్షణ సిగ్నల్ మెరుగుదలకు దారితీస్తుంది. లేదా

వైఫై కాలింగ్

మీ ఫోన్ సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు మీకు Wi-Fi అందుబాటులో ఉంటే, Wi-Fi కాలింగ్‌ను యూజ్‌ చేసుకోండి. దీని కోసం మీ పోన్‌లోని సెట్టింగ్‌లలో కి వెళ్లి Wi-Fi కాలింగ్‌ను ఆన్ చేయండి. ఈ విధంగా, మొబైల్ సిగ్నల్ లేకపోయినా, మీరు Wi-Fi ద్వారా కాల్స్ చేయవచ్చు అదేవిదంగా ఇంటర్నెట్‌ను కూడా ఉపయోగించవచ్చు. వర్షాకాలంలో ఇది ఇంటి లోపల చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మీ మొబైల్‌ని రీస్టార్ట్ చేయండి

మీరు మీ మొబైల్‌ను రీసెట్‌ చేయడం ద్వారా కూడా బలమైన సిగ్నల్ పొందే అవకాశాలను పెంచుతుంది. చాలాసార్లు రీస్టార్ట్ చేయడం వల్ల సాధారణంగా సిగ్నల్ సమస్య పరిష్కారమవుతుంది.

సిగ్నల్ బూస్టర్ ఉపయోగించండి

వర్షాకాలంలో మీరు తరచుగా సిగ్నల్ సమస్యలను ఎదుర్కొంటుంటే, సిగ్నల్ బూస్టర్ కొనండి. ఇది మీ ఇంట్లో సిగ్నల్ లెవెల్‌ను పెంచేందుకు సహాయపడుతుంది. దీన్ని మీ ఇంట్లోని కిటికీ దగ్గర ఉంచండి. దాని వల్ల ఇది బలహీనమైన సిగ్నల్‌లను గ్రహించి మీ ఫోన్‌ను సిగ్నల్‌ను అందిస్తాయి.

మీ నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్‌ను సంప్రదించండి

పైన పేర్కొన్న అన్ని దశలను ప్రయత్నించిన తర్వాత కూడా మీరు సరైన సిగ్నల్‌ను పొందలేకపోతే .. మీరు వెంటనే నెట్‌వర్క్ సర్వీస్ ప్రొవైడర్ కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించండి. మీ ప్రాంతంలోని టవర్‌తో సమస్య ఉండవచ్చు, దానిని వారు రిపేర్ చేసి మీ సమస్యను పరిష్కరిస్తారు.

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
ఎంతకు తెగించ్చార్రా.. బిగ్‌బాస్‌లో దుమారం..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..
లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే.. ఆ డబ్బు ఎవరు కట్టాలి.. రూల్స్..