Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Facebook: ఫేస్‌బుక్‌ మరో సంచలన నిర్ణయం.. ఇకపై ఆ ఫీచర్ అందుబాటులో ఉండదని కీలక ప్రకటన

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సంస్థ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత గోప్యతపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.

Facebook: ఫేస్‌బుక్‌ మరో సంచలన నిర్ణయం.. ఇకపై ఆ ఫీచర్ అందుబాటులో ఉండదని కీలక ప్రకటన
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 03, 2021 | 8:10 AM

Face-Recognition System: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ సంస్థ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత సమాచారం రక్షణలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటంతో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక నుంచి ఫేస్‌బుక్‌లో ఫేషియల్‌ రికగ్నైషన్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఫేస్‌ప్రింటర్లను సైతం తొలగించనున్నట్లు ఫేస్‌బుక్‌ కంపెనీ మాతృసంస్థ ‘మెటా’ ఓ ప్రకటనలో తెలిపింది. ఫేషియల్‌ రికగ్నైషన్‌ టెక్నాలజీలో ఇదోక భారీ మార్పు అని ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ‘మెటా’ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జెరోమ్‌ పెసెంటి తెలిపారు.

‘‘విస్తృత వినియోగం నుంచి పరిమిత వినియోగానికి కుదించడానికి ఫేస్‌బుక్‌లో ఫేస్‌ రికగ్నైషన్‌ సాంకేతికతను మేము తొలగించనున్నాం. ఫేస్‌బుక్‌లో దీన్ని ఉపయోగిస్తున్నవారు ఇక భవిష్యత్‌లో ఈ సాంకేతికతను ఉపయోగించలేరు. ముఖ గుర్తింపు కోసం ఉపయోగించే టెంప్లేట్‌లను తొలగించనున్నాం’’ అని తన బ్లాగ్‌లో ఆయన పేర్కొన్నారు. పెరుగుతున్న సామాజిక ఆందోళనలకు వ్యతిరేకంగా బ్యాలెన్స్‌ చేసేందుకు, ప్రత్యేకించి రెగ్యులేటర్లు ఇంకా స్పష్టమైన నిబంధనలను అందించనందున ఈ సానుకూల నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. “ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది వ్యక్తుల వ్యక్తిగత ముఖ గుర్తింపు టెంప్లేట్‌లను తొలగిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. ఫేస్‌బుక్ కంపెనీకి మెటా అనే కొత్త పేరును గురువారం ప్రకటించిన సంగతి తెలసిందే. తాజా నిర్ణయం “మెటావర్స్”గా భావించే సాంకేతికతను నిర్మించడంపై దృష్టి పెట్టడంలో సహాయపడుతుందన్నారు.

ఫేస్‌ రికగ్నైషన్‌ సాంకేతికతను ఫేస్‌బుక్‌ 2010లో తీసుకొచ్చింది. ఫేస్‌బుక్‌ వాడుతున్న యూజర్లలో మూడొంతుల మంది ఫేషియల్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికతను తొలగించడం వల్ల ఒక బిలియన్‌ కంటే ఎక్కువ మంది ప్రభావితం కానున్నారు. ముఖ్యంగా దృష్టిలోపం ఉన్నవారికి ఉపయోగపడే ఆటోమెటిక్‌ ఆల్ట్‌ టెక్ట్స్‌ (ఏఏటీ)పై దీని ప్రభావం పడనుంది. యూజర్ల ఖాతాల్లోని వ్యక్తిగత ముఖ గుర్తింపు టెంప్లేట్‌లు తొలిగిపోనున్నాయి. ఫోటోలు, వీడియోల్లోని ముఖాలను ఫేస్‌బుక్‌ దానంతట అది గుర్తించదు. ఫొటోల్లోని వ్యక్తి సూచించడానికి, వారి పేరుతో ట్యాగ్‌ చేయడానికి ఇక కుదరదు. ఇక ఫొటోల్లోని వ్యక్తులను ఇతరులు గుర్తించకుండా సాధ్యపడుతుంది.

రోజువారీ క్రియాశీల వినియోగదారులలో మూడవ వంతు కంటే ఎక్కువ మంది తమ ముఖాలను సోషల్ నెట్‌వర్క్ సిస్టమ్ ద్వారా గుర్తించాలని ఎంచుకున్నారు. ముఖ్యంగా Apple iPhoneలను అన్‌లాక్ చేయడానికి తన ఫేస్ ID సిస్టమ్‌ను శక్తివంతం చేయడానికి ఈ రకమైన సాంకేతికతను ఉపయోగిస్తుంది. కాగా, దాదాపు 640 మిలియన్ల మంది. ఫేస్‌బుక్ ఒక దశాబ్దం క్రితం ఫేషియల్ రికగ్నిషన్‌ను ప్రవేశపెట్టింది. అయితే కోర్టులు, రెగ్యులేటర్‌ల నుండి పరిశీలనను ఎదుర్కొన్నందున క్రమంగా ఫీచర్ నుండి వైదొలగడం సులభం చేసింది.

వ్యక్తిగత గోప్యతకు సంబంధించి ఫేస్‌బుక్‌లో ఫేస్‌ రికగ్నైషన్‌ సాంకేతికతతో ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే దీనికి సంబంధించి నియంత్రణ సంస్థలు దీని వినియోగాన్ని నియంత్రించే నిబంధనలు రూపొందించే ప్రక్రియలో ఉన్నట్లు ‘మెటా’ తెలిపింది. అయితే ఈ మార్పులు ఈ నెలలోనే అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత కొన్నిరోజులుగా ఫేస్‌బుక్‌ వ్యక్తిగత గోప్యతపై తరచూ విమర్శలపాలవుతోంది. పలుదేశాల్లో న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంది. ఇటీవల కంపెనీ మాజీ ఉద్యోగి ఫేస్‌బుక్‌ డాక్యుమెంట్లను లీక్‌చేయడంతో ఫేస్‌బుక్‌ మాతృసంస్థకు కష్టాలు ఎక్కువయ్యాయి.

Read Also…  Crime news: నా భర్త పోర్న్‌కు అలవాటు పడ్డాడు.. కాల్‌ గర్ల్స్‌ కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నాడు.. న్యాయం చేయాలని కోర్టు మెట్లెక్కిన మహిళ..