Crime news: నా భర్త పోర్న్‌కు అలవాటు పడ్డాడు.. కాల్‌ గర్ల్స్‌ కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నాడు.. న్యాయం చేయాలని కోర్టు మెట్లెక్కిన భార్య..

'నా భర్త పోర్న్‌ వీడియోలకు బాగా అలవాటు పడ్డాడు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అశ్లీల వీడియోలను చూస్తున్నాడు. ఇదేంటని అడిగినందుకు నన్ను శారీరకంగా వేధించడం ప్రారంభించాడు

Crime news: నా భర్త పోర్న్‌కు అలవాటు పడ్డాడు.. కాల్‌ గర్ల్స్‌ కోసం డబ్బులు ఖర్చు చేస్తున్నాడు.. న్యాయం చేయాలని కోర్టు మెట్లెక్కిన భార్య..

‘నా భర్త పోర్న్‌ వీడియోలకు బాగా అలవాటు పడ్డాడు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అశ్లీల వీడియోలను చూస్తున్నాడు. ఇదేంటని అడిగినందుకు నన్ను శారీరకంగా వేధించడం ప్రారంభించాడు. నేను అతనిని భరించలేకున్నాను. దయచేసి నాకు న్యాయం చేయండి’ అని ఓ బెంగళూరుకు చెందిన ఓ మహిళ కోర్టు మెట్లెక్కింది. తన భర్త అసహజ ప్రవర్తనపై జిల్లా కోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిని విచారించిన న్యాయస్థానం ఈ సంఘటనపై పూర్తి వివరాలు అందించాలని బసవన్న గుడి మహిళా  పోలీసులను ఆదేశించింది . బాధితురాలు పిటిషన్ మేరకు పూర్తి వివరాలిలా ఉన్నాయి.

కాల్‌ గర్ల్స్‌ ఛాటింగ్‌ కోసం డబ్బులన్నీ ఖర్చు చేశాడు.. బెంగళూరులోని జయనగర్‌లో నివాసముంటోన్న శ్రావ్య (పేరు మార్చాం) వయసు 36 ఏళ్లు. ఆమెకు 2019 నవంబర్‌లో రాజేశ్‌(పేరు మార్చాం)తో వివాహమైంది. వివాహ సమయంలో లక్ష రూపాయల విలువ జేసే బంగారం, రూ.2 లక్షల నగదును వరుడికి కట్నంగా అందించారు. అయితే పెళ్లైన కొద్ది రోజులకే రాజేశ్‌ నిజస్వరూపం బయటపడింది. పోర్న్‌ వీడియోలకు బాగా అలవాటు పడిన అతను నిరంతరం వాటి వీక్షణలోనే గడిపేవాడు. ఇక రాత్రిపూట కాల్‌గర్ల్స్‌తో ఆన్‌లైన్‌ ఛాటింగులు కూడా చేసేవాడు. ఇందుకోసం మంచినీళ్ల ప్రాయంలా డబ్బులు ఖర్చుచేశాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రావ్య తన భర్తను మందలించింది. ప్రవర్తనా శైలిని మార్చుకోవాలని సున్నితంగా చెప్పి చూసింది. అయితే ఇది రాజేశ్‌కు ఆగ్రహం తెప్పించింది. భార్యను వేధించడం ప్రారంభించాడు. భర్త అసహజ ప్రవర్తన గురించి శ్రావ్య తన అత్తామామలకు కూడా తెలియజేసింది. వారు తమ కుమారుడు మారతాడని, మరొక అవకాశం ఇవ్వాలని కోడలికి సర్ది చెప్పారు.

నా ఫొటోలు కాల్‌గర్ల్స్‌కు పంపించాడు.. అయితే రాజేశ్‌ ప్రవర్తనా శైలి ఏ మాత్రం మారలేదు. పైగా భార్యను మరింత దారుణంగా హింసించడం మొదలు పెట్టాడు. పాచిపోయిన అన్నం తినాలంటూ ఆమెను నానా రకాలుగా దుర్భాషలాడాడు. ఎవరితోనూ తనను కలవనీయకుండా మానసికంగా వేధించాడు. అంతేగాకుండా భార్య ఫొటోలను కాల్‌గర్ల్స్‌ పంపించడంతో పాటు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశాడు. రాజేశ్‌ ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నా అతని తల్లిదండ్రులు ఏ మాత్రం అడ్డుచెప్పట్లేదని బాధితురాలు పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన జిల్లా మెజిస్ట్రేట్‌ ఈ సంఘటనపై విచారించి పూర్తి వివరాలు అందజేయాలని బసవన్న గుడి మహిళా పోలీసులను ఆదేశించింది.

Also Read:

Road Accident: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు ఫిట్స్.. పంట పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. త్రుటిలో తప్పిన ప్రమాదం!

ACB Raids: భూ రికార్డులు, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ ఏసీబీ అధికారులు సోదాలు.. భారీగా నగదు, అక్రమాస్తులు గుర్తింపు

Crime News: అనంతపురంలో దారుణం.. వేధిస్తున్న భర్తను రోకలి బండతో కొట్టి చంపిన భార్య..

Published On - 8:08 am, Wed, 3 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu