Twitter: ట్విట్టర్ ఖాతాదారులకు బిగ్ షాక్ ఇచ్చిన ఎలన్ మస్క్.. దెబ్బకు యూజర్లంతా జంప్..!
ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోజువారీగా చూసే పోస్టులపై ఆంక్షలు విధించారు. వెరిఫైడ్, అన్‌వెరిఫైడ్, కొత్త అన్‌వెరిఫైడ్ యూజర్లకు వేర్వేరుగా లిమిట్స్ కల్పించారు. వెరిఫైడ్ ఖాతాదారులకు రోజుకు 6వేల పోస్ట్‌లు మాత్రమే చూసే అవకాశం ఉందని వెల్లడించారు.

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రోజువారీగా చూసే పోస్టులపై ఆంక్షలు విధించారు. వెరిఫైడ్, అన్‌వెరిఫైడ్, కొత్త అన్‌వెరిఫైడ్ యూజర్లకు వేర్వేరుగా లిమిట్స్ కల్పించారు. వెరిఫైడ్ ఖాతాదారులకు రోజుకు 6వేల పోస్ట్‌లు మాత్రమే చూసే అవకాశం ఉందని వెల్లడించారు. అన్వెరిఫైడ్ఖాతాదారులు రోజుకు 600 పోస్ట్‌లు మాత్రమే, కొత్త అన్వెరిఫైడ్ఖాతాదారులు కేవలం 300 పోస్ట్‌లు మాత్రమే చూడొచ్చని వివరించారు. ట్విట్టర్‌లో డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మ్యానుపులేషన్నివారించేందుకే.. తాత్కాలికంగా ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఎలాన్‌మస్క్ ట్వీట్‌చేశారు. త్వరలోనే రోజువారీగా చూసే పోస్ట్‌ల సంఖ్యను వెరిఫైడ్ ఖాతాదారులకు 8వేలకు, అన్వెరిఫైడ్ఖాతాదారులు 800లకు, కొత్త అన్‌వెరిఫైడ్400లకు పెంచనున్నట్లు మస్క్మరో ప్రకటనలో వెల్లడించారు. మస్క్తీసుకు వచ్చిన ఈ కొత్త నిబంధనలతో వినియోగదారుడు తన పరిమితికి మించి పోస్ట్‌లను చూసిన తర్వాత స్క్రోలింగ్ బ్లాక్అయ్యే అవకాశం ఉంది.
ఎలన్ నిర్ణయంపై ట్విట్టర్ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్‌కు గుడ్ బై చెప్పి.. బ్లూస్కైకి షిఫ్ట్ అయిపోతున్నారు. దాంతో బ్లూ స్కైకి యూజర్ల తాకిడీ భారీగా పెరిగింది. అయితే, ఒక్కసారిగా ట్రాఫిక్ వచ్చిపడటంతో.. బ్లూస్కైలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని సంస్థ యజమాన్యం ప్రకటించింది. సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామంటూ బ్లూ స్కై ఫౌండర్ జాక్ డోర్స్ ప్రకటించారు.




మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




