Jamun Benefits: వర్షాకాలంలో అల్లనేరేడు పండ్లు తప్పక తినండి.. కారణమేంటంటే..!
అల్లనేరడి పండ్లు, జామున్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. వీటిని కొన్ని ప్రాంతాలలో వేరు వేరు పేర్లతో పిలుస్తారు. ఈ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇండియన్ బ్లాక్ బెర్రీ, బ్లాక్ ప్లం అని పిలువబడే ఈ అల్లనేరడిని.. అడవీ ప్రాంతంలోనే కాక అనేక ప్రాంతాల్లో వీటిని సాగు కూడా చేస్తారు.
అల్లనేరడి పండ్లు, జామున్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. వీటిని కొన్ని ప్రాంతాలలో వేరు వేరు పేర్లతో పిలుస్తారు. ఈ పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇండియన్ బ్లాక్ బెర్రీ, బ్లాక్ ప్లం అని పిలువబడే ఈ అల్లనేరడిని.. అడవీ ప్రాంతంలోనే కాక అనేక ప్రాంతాల్లో వీటిని సాగు కూడా చేస్తారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో పండిస్తారు కూడా. ఈ పండు పుల్లగా, తీపిగా రుచితో అద్భుతంగా ఉంటాయి. రుచి మాత్రమే కాదండోయ్.. ఇందులో అధికస్థాయిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, విటమిన్ సి, బి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. జామున్ గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న పండ్లలో ఒకటి. ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుంది. అందుకే వర్షాకాంలో జామున్‌లను తినాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో జామున్ తినడం వల్ల కలిగే 5 ముఖ్యమైన ప్రయోజనాలు..
1. అల్లనేరడి పండులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దాంతోపాటు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది.
2. ఈ పండు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. మధుమేహం లక్షణాలను తగ్గిస్తుంది.
3. జీర్ణ సమస్యలను నయం చేయడంలో సహాయపడే శీతలకరణిగా పనిచేస్తుంది. వర్షాకాలంలో ప్రేగు కదలికలను నియంత్రిస్తుంది.
4. ఇందులో విటమిన్ సి, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో, నోటి దుర్వాసనను నివారించడంలో సహాయపడతాయి.
5. జామూన్‌లో ఉండే అధిక ఫైబర్ ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. అతిగా తినకుండా నిరోధిస్తుంది. తద్వారా బరువును అదుపులో ఉంచుతుంది.
6. ఇవే కాకుండా.. కిడ్నీలు, లంగ్స్ ఆరోగ్యాన్ని కూడా కాపాడటంతో కీలక పాత్ర పోషిస్తాయి. మరిన్ని ఆరోగ్య పరయోజనాలు ఉన్న నేపథ్యంలో వీటిని తినాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..