Knee Pain Tips: మధుమేమం ఉన్నవారికి మోకాళ్ల నొప్పి బాధిస్తుందా..? ఈ ఆహారాలు తీసుకోండి.. అద్భుతమైన ప్రయోజనం

సరైన జీవనశైలి లేకపోవడం, చెడు ఆహారం మానవ శరీరంలో అనేక చిన్న, పెద్ద వ్యాధులకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం బరువు పెరగడం, మధుమేహం, థైరాయిడ్, హైబీపీ వ్యాధులు సర్వసాధారణమైపోయాయి. ఈ వ్యాధి మొదట మొత్తం శరీరంలోని మోకాళ్లపై..

Knee Pain Tips: మధుమేమం ఉన్నవారికి మోకాళ్ల నొప్పి బాధిస్తుందా..? ఈ ఆహారాలు తీసుకోండి.. అద్భుతమైన ప్రయోజనం
Knee Pain Tips
Follow us
Subhash Goud

|

Updated on: Jul 02, 2023 | 1:33 PM

సరైన జీవనశైలి లేకపోవడం, చెడు ఆహారం మానవ శరీరంలో అనేక చిన్న, పెద్ద వ్యాధులకు దారితీస్తున్నాయి. ప్రస్తుతం బరువు పెరగడం, మధుమేహం, థైరాయిడ్, హైబీపీ వ్యాధులు సర్వసాధారణమైపోయాయి. ఈ వ్యాధి మొదట మొత్తం శరీరంలోని మోకాళ్లపై దాడి చేస్తుంది. దీనివల్ల నడవడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఆహారంలో పోషకాల కొరత ఏర్పడిన వెంటనే మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్ మోకాళ్ల నొప్పి కొన్నిసార్లు ప్రమాదకరమైన రూపం తీసుకుంటుంది. అటువంటి పరిస్థితిలో కొన్నింటి ద్వారా సులభంగా మోకాళ్ల నొప్పిని వదిలించుకోవచ్చు.

ఆహారంలో కాల్షియం, ప్రోటీన్లను చేర్చండి:

ఆహారంలో గరిష్టంగా కాల్షియం, ప్రోటీన్లను చేర్చండి. దీని కారణంగా మీరు మోకాళ్లు, పాదాల నొప్పి నుంచి రక్షించుకోవచ్చు. కొన్నిసార్లు నొప్పి, వాపు కలిసి జరగడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ చిట్కాలను అనుసరించండి.

ఆకు కూరలు, క్యాబేజీ-బ్రోకలీ తినండి:

మీరు మోకాళ్ల నొప్పులు లేదా శరీరంలో వాపులను నివారించాలనుకుంటే ఆకుకూరలు, క్యాబేజీ, బ్రోకలీని ఎక్కువగా తినండి. ఇది మీ శరీరంలోని నొప్పులు, వాపును తగ్గిస్తుంది. దీంతో పాటు ఎముకలు కూడా దృఢంగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

సిట్రస్, విటమిన్-సి అధికంగా ఉండే పండ్లను తినండి:

కొన్ని పండ్లు తినడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటిలో నారింజ, స్ట్రాబెర్రీ, చెర్రీస్ ఉన్నాయి. వీటిలో విటమిన్-సి, లైకోపీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకల వాపును కూడా తగ్గిస్తాయి. అదే సమయంలో ఇది నొప్పిని కూడా తగ్గిస్తుంది.

అల్లం, పసుపుతో ప్రయోజనం:

అల్లం, పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది మీ శరీరం, మోకాళ్ల నొప్పులను నయం చేస్తుంది. అందుకే నొప్పి ఎక్కువగా ఉంటే కషాయం చేసి తాగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి. వీటిని టీవీ9 ధృవీకరించడం లేదు)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి