Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour Package: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అద్భుతమైన టూర్‌ ప్యాకేజీ

IRCTC ఒకటి కంటే ఎక్కువ టూర్ ప్యాకేజీలను లాంచ్ చేస్తూనే ఉంది. ఈ టూర్ ప్యాకేజీల గొప్పదనం ఏమిటంటే మీరు ఏ ప్రదేశాన్ని అయినా చాలా చౌకగా, మెరుగైన సౌకర్యాలతో సందర్శించే అవకాశాన్ని పొందుతారు. దేశంలోని ఇండియన్‌ రైల్వే అన్ని రాష్ట్రాలకు వివిధ రకాల టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది..

IRCTC Tour Package: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. అద్భుతమైన టూర్‌ ప్యాకేజీ
Irctc Tour Package
Follow us
Subhash Goud

|

Updated on: Jul 01, 2023 | 6:54 PM

IRCTC ఒకటి కంటే ఎక్కువ టూర్ ప్యాకేజీలను లాంచ్ చేస్తూనే ఉంది. ఈ టూర్ ప్యాకేజీల గొప్పదనం ఏమిటంటే మీరు ఏ ప్రదేశాన్ని అయినా చాలా చౌకగా, మెరుగైన సౌకర్యాలతో సందర్శించే అవకాశాన్ని పొందుతారు. దేశంలోని ఇండియన్‌ రైల్వే అన్ని రాష్ట్రాలకు వివిధ రకాల టూర్‌ ప్యాకేజీలను అందిస్తోంది. అటువంటి పరిస్థితిలో మీరు ఎన్నడూ లేని ప్రదేశాలను సందర్శించడానికి మీకు అవకాశం ఉంది. ఐఆర్‌సీటీసీ అందుబాటులోకి తీసుకువచ్చే ఇలాంటి సదుపాయాలను తక్కువ ధరల్లోనే సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా రాజస్థాన్‌కు ఐఆర్‌సిటిసి ప్రత్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది.

ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీ కింద భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా తన కస్టమర్ల ఈ ప్రయాణాన్ని ప్రత్యేకంగా అందిస్తోంది. రాబోయే దుర్గా పూజ సమయంలో ఈ టూర్‌ ప్యాకేజీ ప్రారంభమవుతుంది. 20 అక్టోబర్ 2023 నుంచి ప్రారంభమయ్యే ఈ టూర్ ప్యాకేజీ 12 పగలు, 11 రాత్రులు ఉంటాయి. ఈ టూర్ ప్యాకేజీ ద్వారా మీరు అజ్మీర్, ఉదయపూర్, చిత్తోర్‌గఢ్, అబూ రోడ్, జోధ్‌పూర్, జైసల్మేర్, బికనీర్, జైపూర్ వంటి రాజస్థాన్‌లోని అన్ని ప్రత్యేక చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశాన్ని పొందుతారు.

బోర్డింగ్/డీబోర్డింగ్ రైల్వే స్టేషన్లు:

ఈ ప్యాకేజీలో భారత్ గౌరవ్ రైలు బోర్డింగ్/డీబోర్డింగ్ కోల్‌కతా, బాండెల్ జంక్షన్, బుర్ద్వాన్, దుర్గాపూర్, అసన్‌సోల్, ధన్‌బాద్, గోమోహ్, పరస్నాథ్, హజారీబాగ్ రోడ్, కోడెర్మా, గయా, డెహ్రీ ఆన్ సోన్, ససారం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్‌లో ఈ స్టేషన్లు ఉంటాయి

ఇవి కూడా చదవండి

టూర్ ప్యాకేజీలో సౌకర్యాలు:

ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీ కింద మీరు స్లీపర్, థర్డ్ AC కోచ్‌లో ప్రయాణం చేయవచ్చు. మీరు ఎంచుకునే దానిని బట్టి మీ ప్రయాణం ఉంటుంది.ఈ టూర్ ప్యాకేజీ కింద మీరు ప్రతిచోటా హోటల్‌లో బస చేసేందుకు ఐఆర్‌సీటీసీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ప్యాకేజీలో భోజనంలో అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సౌకర్యం కల్పించనున్నారు. ప్రయాణికులు ఎకానమీ క్లాస్‌కు రూ.20,650, స్టాండర్డ్ క్లాస్‌కు రూ.30,960, కంఫర్ట్ క్లాస్‌కు రూ.34,110 చెల్లించాల్సి ఉంటుంది . ప్రయాణీకులందరికీ ప్రయాణ బీమా, రైలు భద్రత ప్రయోజనం కూడా ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి