Bank Holidays July 2023: 14 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయా..?
జూన్ నెల ముగిసింది. జూలై నెల ప్రారంభమైంది. ప్రతి నెల మొదటి నుంచి కొత్త కొత్త నిబంధనలు రావడం అనేది అందరికి తెలిసిందే. ముఖ్యంగా బ్యాంకు వినియోగదారులు గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయనే విషయం. ఎందుకంటే చాలా మంది ప్రతి రోజు..
జూన్ నెల ముగిసింది. జూలై నెల ప్రారంభమైంది. ప్రతి నెల మొదటి నుంచి కొత్త కొత్త నిబంధనలు రావడం అనేది అందరికి తెలిసిందే. ముఖ్యంగా బ్యాంకు వినియోగదారులు గమనించాల్సిన విషయం ఏంటంటే బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయనే విషయం. ఎందుకంటే చాలా మంది ప్రతి రోజు బ్యాంకు లావాదేవీలు, ఇతర పనులు చేసుకుంటారు. ఇలా బ్యాంకు హాలిడేన్‌ను ముందుగానే గమనించుకుంటే ఇబ్బందులు ఉండవు. లేకపోతే ఆర్థిక నష్టంతో పాటు సమయం వృధా అయ్యే అవకాశాలుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు మంత్లీ హాలిడేస్ లిస్ట్‌ను ప్రకటిస్తుంటుంది. అలాగే జూలై నెలలో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి. అయితే వినియోగదారులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సెలవులు అన్ని రాష్ట్రాల బ్యాంకులకు వర్తించవన్న విషయం గుర్తించుకోవాలి.
ఏయే రోజుల్లో బ్యాంకులకు సెలవు అంటే..
- 2 జూలై – ఆదివారం (సాధారణం అన్ని బ్యాంకులకు ఉండే హాలిడే)
- 5 జూలై – గురు గోవింద్ జయంతి (జమ్ము, శ్రీనగర్‌లో మాత్రమే బ్యాంకులు మూసి ఉంటాయి)
- 6 జూలై – ఎంహెచ్ఐపీ సెలవు (మిజోరం రాష్ట్రంలో బ్యాంకులకు సెలవు)
- 8 జూలై – రెండో శనివారం (ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి.)
- 9 జూలై – ఆదివారం (సాధారణ అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి)
- 11 జూలై – కేరా పూజా (త్రిపురాలో బ్యాంకులు మూసి ఉంటాయి)
- 13 జూలై – భాను జయంతి (సిక్కింలో బ్యాంకులకు సెలవు)
- 16 జూలై – ఆదివారం (సాధారణ బ్యాంకులకు ఉండే సెలవు)
- 17 జూలై – యూ తిరోట్ సింగ్ డే (మేఘాలయలో)
- 22 జూలై – నాలుగో శనివారం (కొన్ని రాష్ట్రాల్లో)
- 23 జూలై – ఆదివారం
- 29 జూలై – మొహర్రం
- 30 జూలై – ఆదివారం
- 31 జూలై – షహాదత్ (హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్)
ఇవి కూడా చదవండి
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి