GST Collection: భారత ప్రభుత్వానికి రికార్డ్ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు.. జూన్ నెలలో ఎంత అంటే..!
గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లలో ప్రభుత్వం దూసుకుపోతోంది. నెలనెల జీఎస్టీ వసూళ్లు పెరిగిపోతున్నాయి. దీంతో భారత ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చి చేరుతోంది..
జూన్ నెలలో భారత ప్రభుత్వ జీఎస్టీ వసూళ్లు 12% పెరిగి రూ.1.61 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు ఏప్రిల్ 2023లో భారతదేశంలో రికార్డు స్థాయిలో రూ.1.87 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. అయితే మే నెలలో భారత ప్రభుత్వం జీఎస్టీ వసూళ్లు రూ.1,57,090 కోట్లు. దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చి 6 ఏళ్లు పూర్తయ్యాయి. భారతదేశంలో పన్నుల చరిత్రలో జీఎస్టీని ప్రవేశపెట్టడం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిరూపితమైంది.
జూన్‌లో భారత జీఎస్‌టీ వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 12 శాతం పెరిగి రూ.1,61,497 కోట్లుగా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. దీంతో నెలవారీ జీఎస్టీ వసూళ్లు వరుసగా 15వ నెల రూ.1.4 లక్షల కోట్లు దాటాయి. దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఆరోసారి జీఎస్టీ వసూళ్లు 1.6 లక్షల కోట్లు దాటాయి.
Gross GST revenue collected in the month of June 2023 is Rs 1,61,497 crore; records 12% year-on-year growth: Ministry of Finance pic.twitter.com/oJEt2ROg0G
— ANI (@ANI) July 1, 2023
జూన్ నెలలో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.161497 కోట్లు ఉండగా, ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.31013 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ.38292 కోట్లు. ఐజీఎస్టీ రూ.80292 కోట్లు. ఇందులో దిగుమతుల ద్వారా 39035 కోట్ల రూపాయలు, సెస్ ద్వారా 11900 కోట్లు వచ్చాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి