Whatsapp: వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్‌ చేశారని అనుమానంగా ఉందా.? ఇలా కాన్ఫామ్‌ చేసుకోండి..

Whatsapp: స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ కచ్చితంగా ఉపయోగించే యాప్స్‌లో వాట్సాప్‌ ఒకటి. మెసేజింగ్ యాప్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది వాట్సాప్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యాప్‌ను యూజర్‌ ఫ్రెండ్లీగా రూపొందించడం...

Whatsapp: వాట్సాప్‌లో మిమ్మల్ని బ్లాక్‌ చేశారని అనుమానంగా ఉందా.? ఇలా కాన్ఫామ్‌ చేసుకోండి..
Whatsapp
Follow us

|

Updated on: Sep 22, 2022 | 1:12 PM

Whatsapp: స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరూ కచ్చితంగా ఉపయోగించే యాప్స్‌లో వాట్సాప్‌ ఒకటి. మెసేజింగ్ యాప్‌ అంటే ముందుగా గుర్తొచ్చేది వాట్సాప్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. యాప్‌ను యూజర్‌ ఫ్రెండ్లీగా రూపొందించడం, ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ఈ ఫీచర్‌కు ఇంతలా డిమాండ్‌. ఇదిలా ఉంటే వాట్సాప్‌ ఫీచర్స్‌లో బ్లాక్‌ ఆప్షన్‌ ఒకటి. సెలక్ట్‌ చేసుకున్న వ్యక్తుల నుంచి మనకు మెసేజ్‌లు, కాల్స్‌ రాకూడదనుకుంటే ఈ ఫీచర్‌ను ఉపయోగించి వారిని బ్లాక్‌ చేస్తుంటాము. అయితే మనల్ని ఎవరైనా బ్లాక్‌ చేస్తే ఆ విషయం అంత సులభంగా తెలియదు. కానీ కొన్ని సింపుల్‌ టిప్స్‌ ద్వారా మిమ్మల్ని ఎవరు బ్లాక్‌ చేశారో తెలుసుకోవచ్చు. ఇంతకీ ఆ టిప్స్‌ ఏంటంటే..

* ఎవరైనా మీ కాంటాక్ట్‌ను వాట్సాప్‌లో బ్లాక్‌ చేశారన్న అనుమానం ఉంటే వారి కాంటాక్ట్‌ను ఓపెన్‌ చేసి వారి లాస్ట్‌ సీన్‌ను చూడండి. ఒకవేళ లాస్ట్‌ సీన్‌ కనిపించకపోతే అది కూడా ఒక ఇండికేషన్‌గా భావించాలి. అయితే లాస్ట్‌ సీన్‌ కనిపించకుండా కూడా చేసుకునే సెట్టింగ్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

* ఇక మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారన్న విషయాన్ని ప్రొఫైల్‌ ఫొటో ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఎదుటి వ్యక్తి ప్రొఫైల్‌ ఫొటో కనిపించకపోయినా బ్లాక్‌ చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే అందరికీ ప్రొఫైల్‌ ఫొటో కనిపించకుండా సెట్టింగ్‌ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

* మిమ్మల్ని బ్లాక్‌ చేశారన్న అనుమానం ఉన్న కాంటాక్ట్‌కు వాట్సాప్‌ నుంచి ఒక మెసేజ్‌ను పంపించండి. ఒకవేళ ఆ మెసేజ్‌కు డబుల్‌ టిక్‌ రాకపోతే వారు మిమ్మల్ని బ్లాక్‌ చేసినట్లు అర్థం చేసుకోవాలి.

* ఇక వాట్సాప్‌ కాల్‌ చేయడం ద్వారా కూడా మిమ్మల్ని బ్లాక్‌ చేశారో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ బ్లాక్‌ లిస్ట్‌లో ఉంటే ఎదుటి వ్యక్తికి కాల్‌ కనెక్ట్‌ అవ్వదు.

* పైన తెలిపిన అంశాలు కొన్ని సందర్భాల్లో టెక్నికల్‌ సమస్యలతో కూడా వస్తుండొచ్చు. కానీ మిమ్మల్ని బ్లాక్‌ చేశారనుకున్న వ్యక్తి నెంబర్‌తో గ్రూప్‌ క్రియేట్‌ చేస్తే బ్లాక్‌ చేశారో లేదో ఇట్టే తెలిసిపోతుంది. ఒకవేళ ‘గ్రూప్‌లో ఈ నెంబర్‌ను మీరు యాడ్ చేయలేరు’ అని మెసేజ్‌ చూపిస్తే కచ్చితంగా వారు మీ నెంబర్‌ను బ్లాక్‌ చేసినట్లేనని కాన్ఫామ్‌ చేసుకోవాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..