Amazon Great Indian Festival: అమెజాన్ ఆఫర్ల పండగ వచ్చేసింది.. అదిరిపోయే ఆఫర్లు, భారీ డిస్కౌంట్‌లు..
Amazon Great Indian Festival: పండగ ఉత్సాహాన్ని మరింత రెట్టింప చేస్తూ ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్...
Amazon Great Indian Festival: పండగ ఉత్సాహాన్ని మరింత రెట్టింప చేస్తూ ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌ను నిర్వహిస్తోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2022 పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్ సెప్టెంబర్ 23న ప్రారంభమవుతుంది. ఇక ప్రైమ్ మెంబర్స్ కోసం ప్రత్యేకంగా సేల్ ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల నుంచి గ్రాసరీల వరకు ప్రతీ ఒక్క ప్రొడెక్ట్‌పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. అంతేకాకుండా ఎస్‌బీ కార్డుతో కొనుగోలు చేసే వారి కోసం అమెజాన్ ప్రత్యేకంగా 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఈఎమ్‌ఐ ట్రాన్సాక్షన్స్‌పై ఈ ఆఫర్ అందించనున్నారు.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా మొత్తం 11 లక్షల విక్రయదారులు, కోట్లాది వస్తువులను అమెజాన్.ఇన్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా 2000 కొత్త ప్రొడక్ట్స్‌ను ఈ సేల్‌లో ప్రారంభించనున్నారు. శామ్‌సంగ్, ఎమ్‌ఐ, రెడ్‌మీ, వన్‌ప్లస్, ఎల్‌జీ, సోనీ, బోట్, హెచ్‌పీ, లెనోవో, ఫైర్ బోల్ట్, నాయిస్, వీయూ, టీఎల్‌సీ, అసర్, అలెన్ సొల్లీ, బిబా, మ్యాక్స్, పుమా, అడిడాస్, అమెరికన్ టూరిస్టర్, సఫారీ, ఫిలిప్స్, టాటా టీ, పెడిగ్రీ, హిమాయల, సర్ఫ్ ఎక్సెల్, యూరేకా ఫోర్బ్స్, హావెల్స్, హీరో సైకిల్స్‌తో పాటు మరెన్నో ప్రొడక్ట్స్‌పై అదిరిపోయే ఆఫర్లు అందిస్తున్నారు.
కస్టమర్స్ తాము కొనుగోలు చేయాలనుకునే ప్రొడక్ట్స్ విషయమై నిపుణులతో నేరుగా చర్చించుకునే అవకాశాన్ని కల్పించారు. అమెజాన్.ఇన్ వెబ్‌సైట్ ద్వారా వినియోగదారులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇందుకోసం 600 లైవ్ స్ట్రీమ్స్ వీడియోను యాప్‌లో పొందిపరిచారు. అలాగే కస్టమర్స్ అమెజాన్‌లో ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయడం ద్వారా ‘డైమండ్స్’ను పొందే అవకాశం కల్పించారు. కేవలం షాపింగ్ చేయడం ద్వారా మాత్రమే కాకుండా మీనీ టీవీలో వీడియోలను వీక్షించడం, ఫన్ జోన్‌లో గేమ్స్ ఆడడం ద్వారా డైమండ్స్ పొందొచ్చు. వీటిని రీడీమ్ చేసుకోవడం ద్వారా క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అంతే కాకుండా అమెజాన్.ఇన్‌లో బిల్స్ చేయడం, ఫోన్ రీచార్జ్ చేయడం ద్వారా రూ. 7500 వరకు రివార్డ్స్ పొందే అవకాశాన్ని అమెజాన్ కల్పించింది. మొదటిసారి అమెజాన్ పే ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన వారికి రూ. 50 క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఇక ఈ సేల్ సమయంలో అమెజాన్ ఐసీసీఐ క్రెడిట్ కార్డ్‌కు అప్లై చేసుకున్న వారు రూ. 2500 రివార్డ్స్ పొందొచ్చు.
అమెజాన్ బిజినెస్ కస్టమర్స్ కోసం కూడా మంచి ఆఫర్లను తీసుకొచ్చింది. వీరికి అదనంగా 28 శాతం జీఎస్‌టీని ఆదా చేసుకునే అవకాశం కల్పించింది. అలాగే పెద్ద మొత్తంలో ల్యాప్‌టాప్‌లు, మానిటర్స్, టీవీలు, వ్యాక్యూమ్ క్లీనర్స్ కొనుగోలు చేసే వారు 40 శాతం డిస్కౌంట్‌ను పొందొచ్చు. వీటితో పాటు బ్యాంకుల ఆఫర్లతో అదనంగా 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. అమెజాన్ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు సులభంగా షాపింగ్ చేసుకునేందుకు వీలుగా తెలుగు, తమిళం, హిందీ, మలయాలం, తమిళ్, కన్నడ, బంగ్లా, మరాఠీ భాషల్లో యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..