Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphones: ఏ ఫోన్‌ కొనాలో తెలియక తికమకపడుతున్నారా.? రూ. 15 వేల లోపు బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..

Smartphones Under 15k: దసర పండగ ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ సైట్స్‌ రకరకాల ఆఫర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా పలు ఆకర్షణీయమైన..

Smartphones: ఏ ఫోన్‌ కొనాలో తెలియక తికమకపడుతున్నారా.? రూ. 15 వేల లోపు బెస్ట్‌ స్మార్ట్‌ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
Representative Image
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 23, 2022 | 10:07 AM

Smartphones Under 15k: దసర పండగ ఉత్సాహాన్ని మరింత పెంచేందుకు ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ సైట్స్‌ రకరకాల ఆఫర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భాగంగా పలు ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకొచ్చింది. సెప్టెంబర్‌ 23న ప్రారంభమైన సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఆఫర్‌లో భాగంగా పలు బ్యాంకుల క్రెడిట్‌, డెబిట్ కార్డులపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. మరి ఈ సేల్‌లో రూ. 15,000 లోపు ఏయే స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి.? వాటి ఫీచర్లు ఎలా ఉన్నాయి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

vivo T1 44W:

రూ. 15లోపు అందుబాటులో ఉన్న బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌లో వివో టీ1 ఒకటి. 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 13,499కి లభిస్తోంది. దీంతో పాటు పలు బ్యాంకుల కార్డులతో 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ ఉంది. ఇందులో 6.4 ఇంచెస్‌ ఫుల్ హెచ్‌డీ+అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ, 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఇచ్చారు.

OPPO K10 5G:

ఒప్పో కే10 5జీ స్మార్ట్‌ ఫోన్‌ 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 14,999గా ఉంది. కార్డులపై ప్రత్యేకంగా 10శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్ అదనం. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. అలాగే 48 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. మీడియాటెక్‌ డైమన్సిటీ 810 ప్రాసెసర్‌ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

realme 9i 5G:

రూ. 15వేలకు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్‌ ఫోన్‌లో రియల్‌మీ 9ఐ ఫోన్‌ ఒకటి. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధర రూ. 14,999గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 50 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరా, 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఈ ఫోన్‌ సొంతం.

realme C35:

4జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 12,221కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 6.6 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 50 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

REDMI 10:

6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ఆఫర్‌లో భాగంగా రూ. 12,499కి అందుబాటులో ఉంది. ఇక ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.7 ఇంచెస్‌ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. 6000 ఎమ్‌ఏహెచ్‌ లిథియం పాలీమర్‌ బ్యాటరీతో రూపొందించిన ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు 5 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..