AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Social Media: అనుమతి లేకుండా మీ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయా.? అలాంటప్పుడు ఏం చేయాలంటే..

Social Media: టెక్నాలజీ వినియోగం పెరగడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతున్నాయో అలాగే నష్టాలు కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవితం ప్రశ్నార్థంకంగా మారుతోంది...

Social Media: అనుమతి లేకుండా మీ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయా.? అలాంటప్పుడు ఏం చేయాలంటే..
Viral News
Narender Vaitla
|

Updated on: Sep 22, 2022 | 10:57 AM

Share

Social Media: టెక్నాలజీ వినియోగం పెరగడం వల్ల ఎన్ని లాభాలు కలుగుతున్నాయో అలాగే నష్టాలు కూడా ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత జీవితం ప్రశ్నార్థంకంగా మారుతోంది. అనుమతి లేకుండా వ్యక్తిగత ఫొటోలను, వీడియోలను కొందరు నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా చండీగఢ్‌ యూనివర్సిటీలో జరిగిన సంఘటన ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది.

ఓ యువతి నగ్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నయన్న వార్తతో వర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఇలా ఎప్పుడైనా మన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలు కానీ, ఫొటోలు, వీడియోలు కానీ నెట్టింట వైరల్‌ అయితే ఏం చేయాలి.? ఎవరిని సంప్రదించడం ద్వారా వాటిని తొలగించవచ్చు లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* మీ వ్యక్తిగత వివరాలు ఆన్‌లైన్‌లో వైరల్‌ అవుతున్నట్లు కనిపిస్తే కంగారు పడకుండా నేరుగా పోలీస్‌ స్టేషన్‌ వెళ్లాలి. వీలైనంత త్వరగా సైబర్‌ సెల్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే.. వాటిని డిలీట్‌ చేసే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

* మీ వివరాలు ఏ వెబ్‌సైట్‌లో అయితే వైరల్‌ అవుతున్నాయో నేరుగా ఆ వెబ్‌సైట్‌కు ఫిర్యాదు చేయొచ్చు. సదరు వెబ్‌సైట్‌కు ఉండే ప్రత్యేక ఈమెయిల్‌ ద్వారా మీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. ఇందులో ఏమైనా ఇబ్బంది ఉంటే థార్డ్‌ పార్టీ వెబ్‌సైట్‌.. www.whois.comలోకి వెళ్లాలి. ఇందులో మీకు సమాచారం కావాలనుకుంటున్న వెబ్‌సైట్‌ లింక్‌తో సెర్చ్‌ చేస్తే అన్ని వివరాలు తెలుస్తాయి. దీనిద్వారా మీ అభ్యంతరాన్ని తెలిపి కంటెంట్‌ను తొలగించమని అడగొచ్చు.

* ఇక కొన్ని సందర్భాల్లో ఫొటోలు, వీడియోలు గూగుల్ సెర్చ్‌ రిజల్ట్స్‌లోనూ దర్శనమిస్తుంటాయి. అలాంటి వాటిని తొలగించేందుకు గూగుల్ సపోర్ట్‌ పేజీని సందర్శించాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా support.google.com వెబ్‌సైట్‌లోకి వెళ్లి. మీకు సంబంధించిన ఏ సమాచారం గూగుల్‌ సెర్చ్‌లో వస్తుందో ఎంటర్‌ చేసి సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..