Youtube Shorts: యూట్యూబ్‌లో షార్ట్స్ చేస్తారా.? అయితే మీ పంట పండినట్లే.. కీలక నిర్ణయం..
Youtube Shorts: ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ సంస్థ యూట్యూబ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిన్న అవసరం వచ్చినా సరే వెంటనే యూట్యూబ్‌ను ఓపెన్ చేసే రోజులివీ. ఓవైపు యూజర్లకు..
Youtube Shorts: ప్రముఖ వీడియో ప్లాట్‌ఫామ్ సంస్థ యూట్యూబ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ చిన్న అవసరం వచ్చినా సరే వెంటనే యూట్యూబ్‌ను ఓపెన్ చేసే రోజులివీ. ఓవైపు యూజర్లకు అప్‌డేట్స్ ఇస్తూనే మరోవైపు క్రియేటర్లకు కూడా అదిరిపోయే ఆఫర్స్ అందిస్తూ వస్తోంది. ఇలా అందుబాటులోకి తీసుకొచ్చిన వాటిలో షార్ట్స్ ఒకటి. టిక్‌టాక్ యాప్ ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న సమయంలో పోటీగా యూట్యూబ్ షార్ట్స్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం భారత్‌లో షార్ట్స్‌కు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది ఔత్సాహిక క్రియేటర్లు షార్ట్స్‌ను రూపొందిస్తూ భారీగా ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా షార్ట్స్ క్రియేటర్లకు డబ్బులు సంపాదించుకునే అవకాశం కల్పిస్తూ యూట్యూబ్ నిర్ణయం తీసుకుంది. ఇకపై షార్ట్‌లపై యాడ్స్ ఇవ్వనున్నారు. ఈ ప్రకటనలకు వచ్చిన ఆదాయంలో 45 శాతం మొత్తాన్ని క్రియేటర్లకు పంచనున్నట్లు యూట్యూబ్ మంగళవారం ప్రకటించింది. యూట్యూబ్ క్రియేటర్స్‌కి భారీగా మద్దతునిచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ నీల్ మోహన్ తెలిపారు. యూట్యూబ్ ప్రకటించిన ఈ నిర్ణయంతో క్రియేటర్లు పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది హాఫ్‌లో యూట్యూబ్ యాడ్స్ ద్వారా ఏకంగా 142 బిలియన్ డార్లను ఆర్జించింది. గతేడాదితో పోల్చితే 9 శాతం పెరగడం విశేషం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..