Nothing Phone 1: ఇలాంటి ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు.. నథింగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. కొంత సమయం మాత్రమే..

Nothing Phone 1: నథింగ్‌ ఫోన్‌ (1) ఇండియన్‌ మార్కెట్లో భారీ క్రేజ్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇండియన్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ ఒక సేల్‌ను పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్ వేదికగా మరో సేల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది...

Nothing Phone 1: ఇలాంటి ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు.. నథింగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. కొంత సమయం మాత్రమే..
Nothing Phone 1
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 20, 2022 | 11:47 AM

Nothing Phone 1: నథింగ్‌ ఫోన్‌ (1) ఇండియన్‌ మార్కెట్లో భారీ క్రేజ్‌ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇండియన్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌ ఒక సేల్‌ను పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఫ్లిప్‌కార్ట్ వేదికగా మరో సేల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. అయితే ఈ సేల్‌లో ఫోన్‌లో భారీ డిస్కౌంట్‌ను అందించనున్నాయి. కేవలం కొన్ని యూనిట్లు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్న కంపెనీ ఫోన్‌పై భారీ ఆఫర్‌ను ప్రకటించింది. సెప్టెంబర్‌ 20 (ఈ రోజు) మధ్యాహ్నం 12 గంటలకు సేల్‌ మొదలు కానుంది.

నథింగ్‌ ఫోన్‌ (1) ఆఫర్‌తో బేస్‌ మోడల్‌ను రూ. 28,999కే సొంతం చేసుకునే అశాకం లభించనుంది. అలాగే పలు బ్యాంకుల కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందే అవకాశం కల్పించనుంది. అంతేకాకుండా పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేయడం ద్వారా అదనంగా మరో రూ. 3000 వరకు డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇక ఈ ఫోన్‌ అసలు ధర విషయానికొస్తే.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.33,999, 8జీబీ+258జీబీ రూ.36,999, 12జీబీ+256జీబీ వేరియంట్ రూ.39,999గా ఉంది.

ఫీచర్లు ఇలా ఉన్నాయి..

నథింగ్ ఫోన్‌ (1) విషయానికొస్తే ఇందులో 6.55 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. స్నాప్‌డ్రాగన్ 778జీ+ ప్రాసెసర్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్ ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. 4500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఈ ఫోన్‌ సొంతం.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..