Android Phone: అదిరిపోయే కెమెరా ఫీచర్స్.. తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్..

తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కోవాలనుకునే వారికి చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ హానర్ ఓ కొత్త మోడల్ ఫోన్ ను విడుదల చేసింది. Honor X6 పేరిట ఈస్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఈఫోనులో..

Android Phone: అదిరిపోయే కెమెరా ఫీచర్స్.. తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్..
Honor X6
Follow us
Amarnadh Daneti

|

Updated on: Sep 22, 2022 | 12:53 PM

Android Phone: తక్కువ ధరలో మంచి ఫీచర్స్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ కొనుక్కోవాలనుకునే వారికి చైనీస్ స్మార్ట్ ఫోన్ మేకర్ హానర్ ఓ కొత్త మోడల్ ఫోన్ ను విడుదల చేసింది. Honor X6 పేరిట ఈస్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. ఈఫోనులో అదిరిపోయే కెమెరా ఫీచర్లు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఈఫోన్ ప్రత్యేకత. అలాగే ఫోన్ Led ఫ్లాష్‌ను కలిగి ఉంది. ఈ కెమెరా X6 పోర్ట్రెయిట్ మోడ్, పనోరమా, టైమ్-లాప్స్ ఫోటోగ్రఫీ,1080p వీడియో రికార్డింగ్ వంటి ఫోటోగ్రఫీ ఫీచర్‌లను అందిస్తుంది. ఇంకా వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే, హీలియో G-సిరీస్ చిప్‌సెట్, పెద్ద బ్యాటరీ వంటివి ఈఫోన్ లో ప్రధాన ఫీచర్స్. Honor X6 ఓషన్ బ్లూ, టైటానియం సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్ వంటి మూడు ఆకర్షణీయమైన కలర్స్‌లో లభిస్తుంది. స్టోరేజ్, ర్యామ్ ఆధారంగా ఈ ఫోన్ రెండు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంటుంది. ఫోన్ లో సెక్కూరిటీ ఫీచర్స్ కూడా బాగున్నాయి. X6 ఫేస్ అన్‌లాక్, సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది ఈ ఫోన్. ఎన్నో మెరుగైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్ సరసమైన ధరలోనే లభించనుంది.

Honor X6 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు : 60hz రిఫ్రెష్ రేట్‌ కలిగిన 6.5 అంగుళాల Hd+ Lcd డిస్‌ప్లే

4gb Ram, 64 Gb/128 Gb స్టోరేజ్ సామర్థ్యం

ఇవి కూడా చదవండి

మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్

వెనకవైపు 50 Mp + 2mp డ్యుయల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 5 Mp సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 Mah బ్యాటరీ సామర్థ్యం, 10w ఫాస్ట్ ఛార్జర్

ప్రస్తుతం ఈ ఫోన్ సౌదీ అరేబియాలో లాంచ్ అయింది. త్వరలోనే మిగతా మార్కెట్లలోకి రానుంది. అయితే ధర, లభ్యత వివరాలను కంపెనీ వెల్లడించలేదు. సుమారు రూ.15 వేల వరకు ఉండొచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే