Dangerous Apps: గూగుల్ ప్లే స్టోర్‌లో 2 మిలియన్లకుపైగా డౌన్‌లోడ్‌లు ఉన్న ప్రమాదకరమైన యాప్స్ గుర్తింపు
మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో ప్లేస్టోర్ నుంచి, ఇతర వాటి నుంచి వివిధ రకాల యాప్స్‌ను డౌన్‌లోడ్ చేస్తున్నారా..? అయితే ప్రమాదంలో పడినట్లే. ఈ మధ్య కాలంలో ప్లే స్టోర్‌లో..

మీరు మీ ఆండ్రాయిడ్ మొబైల్‌లో ప్లేస్టోర్ నుంచి, ఇతర వాటి నుంచి వివిధ రకాల యాప్స్‌ను డౌన్‌లోడ్ చేస్తున్నారా..? అయితే ప్రమాదంలో పడినట్లే. ఈ మధ్య కాలంలో ప్లే స్టోర్‌లో కూడా నకిలీ యాప్‌లు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ యాప్‌ల వల్ల భారీ ఎత్తున మోసాలు జరుగుతున్నాయి. మాల్వేర్‌తో కూడిన యాప్‌ల కారణంగా వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు ఖాతాలు కూడా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. వినియోగదారుల డేటాను దొంగలించే ప్రమాదం పొంచివున్నట్లు గూగుల్ ప్లే హెచ్చరిస్తోంది. ప్రమాదకరమైన మాల్వేర్‌తో కూడిన యాప్‌ల సమూహాన్ని గూగుల్ ప్లే యాప్ స్టోర్‌లో భద్రతా సంస్థ కనుగొంది. యాప్‌లు 2 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌ల కలెక్టివిటీని కలిగి ఉన్నాయని గుర్తించింది. ప్రస్తుతం మాల్వేర్‌తో నిండిన కొన్ని యాప్‌లు గూగుల్ పేలో అందుబాటులో లేవు. అయినప్పటికీ వినియోగదారులు తమ ఫోన్‌లలో వాటిని ఇన్‌స్టాల్ చేసి ఉండవచ్చు. వినియోగదారులు తమ ప్రైవేట్ డేటాను కాపాడుకోవడానికి వాటిని వెంటనే తొలగించాలని సూచిస్తోంది.
ట్యూబ్‌బాక్స్ అని పిలువబడే యాప్‌లలో ఒకటి 1 మిలియన్ డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. వీడియోలు, ప్రకటనలను చూడటం ద్వారా డబ్బు సంపాదించడంలో వినియోగదారులకు సహాయపడుతుందని యాప్ హామీ ఇచ్చింది. అలాగే వినియోగదారులు రివార్డులను కూడా పొందవచ్చని ప్రకటనలు వస్తుండటంతో చాలా మంది యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.
ఫాస్ట్ క్లీనర్ అండ్ కూలింగ్ మాస్టర్ అని పిలువబడే మరో యాప్ గూగుల్ ప్లేలో ఓఎస్ ఆప్టిమైజేషన్ టూల్‌గా అందుబాటులో ఉంది. ఈ యాప్‌లో 500,000 డౌన్‌లోడ్‌లు ఉన్నాయి. అలాగే కొత్త యాడ్‌వేర్ మాడ్యూల్‌ను కలిగి ఉన్న కొన్ని యాప్‌లు కూడా గుర్తించింది గూగుల్. ఈ మాల్వేర్ ద్వారా ప్రభావితమైన యాప్‌లలో బ్లూటూత్ పరికరం ఆటో కనెక్ట్, బ్లూటూత్, వైఫై, యూఎస్‌బీ డ్రైవర్, వాల్యూమ్, మ్యూజిక్ ఈక్వలైజర్ ఉన్నాయి. మూడు యాప్‌లు 1.15 మిలియన్ల మంది ఇన్‌స్టాల్ చేసుకున్నట్లు గూగుల్ గుర్తించింది. ఇలాంటి నకిలీ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని గూగుల్ హెచ్చరిస్తోంది.




మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి