ISRO-GSLV MkIII: ఇస్రో అమ్ములపొదిలో బాహు‌బలి.. ప్రయో‌గా‌నికి కౌంట్‌‌డౌన్‌ షురూ.. అర్ధరాత్రి నింగిలోకి ఎగరనున్న రాకెట్

వన్ వెబ్ ఇండియా-1 మిషన్ ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఇస్రోతో పాటు, లండన్ లోని నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్, న్యూ స్పేస్ ఇండియా ఈ మిషన్ లో పాలుపంచుకుంటున్నాయి.

ISRO-GSLV MkIII: ఇస్రో అమ్ములపొదిలో బాహు‌బలి.. ప్రయో‌గా‌నికి కౌంట్‌‌డౌన్‌ షురూ.. అర్ధరాత్రి నింగిలోకి ఎగరనున్న రాకెట్
Lvm3 M3
Follow us
Surya Kala

|

Updated on: Oct 22, 2022 | 1:15 PM

మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సన్నద్ధమైంది. తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి అక్టోబర్ 23న బాహుబలి రాకెట్‌ జీఎస్‌ఎల్వీ-మార్క్‌ 3 ను ప్రయోగించనుంది. GSLV మార్క్- 3 ద్వారా ఏకంగా 36 విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది ఇస్రో. అయితే ఈ రాకెట్ ను LVM- 3గానూ పిలుస్తున్నారు. వన్ వెబ్ ఇండియా-1 మిషన్ ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. ఇస్రోతో పాటు, లండన్ లోని నెట్ వర్క్ యాక్సెస్ అసోసియేషన్ లిమిటెడ్, న్యూ స్పేస్ ఇండియా ఈ మిషన్ లో పాలుపంచుకుంటున్నాయి. ఈ లాంచ్ వెహికల్ మార్క్ 3ని శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్నారు.

ఒకే సారి 36 విదేశీ కమర్షియల్ ఉపగ్రహాలను తీస్కెళ్తుండగా.. వీటి బరువు 5200 కిలోలుగా ఉంది. NSILతో ఒప్పందం తర్వాత నిర్మాణమైన తొలి బరువైన రాకెట్ ఇదే. ఈ 36 ఉపగ్రహాలను దిగువ భూ స్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది LVM- 3. నింగిలోకి ప్రయోగించిన 16 నిమిషాలు 21 సెకన్లలో 36 ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రవేశ పెడుతుంది.  24 గంటల కౌంట్ డౌన్ పూర్తి అయ్యి .. అర్ధరాత్రి 12.07 గంటలకు నింగిలోకి రాకెట్ ఎగరనున్నది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ప్రయోగిస్తోన్న LVM- 3 ఎత్తు 43. 43 మీటర్లుండగా.. వ్యాసం 4 మీటర్లు. బరువు 64వేల కిలోల పేలోడు తీస్కెళ్లే సామర్ధ్యం కలిగి ఉంది. క్రయోజెనిక్ దశ ద్వారా హెవీ పేలోడ్లను 600 కిలోమీటర్ల ఎత్తులో దిగువ భూ కక్ష్యలో ప్రవేశ పెడుతుంది. అంతే కాదు.. జీశాట్ సీరీస్ కు చెందిన 4 టన్నుల బరువున్న ఉపగ్రహాలను భూస్థిరకక్ష్యలోకి ప్రవేశ పెట్టే సామర్ధ్యం దీని సొంతం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..