AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Refrigerator Using: మీ ఇంట్లో ఫ్రిజ్‌ను ఉపయోగిస్తున్నారా..? ఈ మూడు తప్పులు చేయకండి.. ఫుడ్‌ టెస్టే మారిపోతుంది!

 ఫ్రిజ్ అనేది మన ఇంట్లో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఇతర పదార్థాలు, వస్తువులను తాజాగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఫ్రిజ్‌ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి..

Refrigerator Using: మీ ఇంట్లో ఫ్రిజ్‌ను ఉపయోగిస్తున్నారా..? ఈ మూడు తప్పులు చేయకండి.. ఫుడ్‌ టెస్టే మారిపోతుంది!
Refrigerator Using
Subhash Goud
|

Updated on: Oct 22, 2022 | 12:23 PM

Share

ఫ్రిజ్ అనేది మన ఇంట్లో ఒక ముఖ్యమైన భాగం. ఇది ఇతర పదార్థాలు, వస్తువులను తాజాగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇవే కాకుండా ఫ్రిజ్‌ వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఇక రిఫ్రిజిరేటర్‌ను శుభ్రపరచడం నుండి దానిని సరిగ్గా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం కూడా ఎంతో ముఖ్యం. అయితే కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచిన తర్వాత దాని రుచి కూడా మరిపోతుండటం గమనించే ఉంటారు. కొన్ని ఆహారాలు పాడైపోవడం, దానిపై క్రిములు తయారు కావడం లాంటివి జరుగుతుంటాయి. మరి ఫ్రిజ్‌లో వస్తువులను ఉంచేటప్పుడు మనం చేయకూడని తప్పులు ఏంటో తెలుసుకుందాం.

  1. ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడితే.. ఫ్రిజ్‌లోని ఆహారంలో కీటకాలు, సాలెపురుగులు లేదా ఈగలు పడతాయని మనం తరచుగా అనుకుంటాము. లేకపోతే ఆహారం తాజాగా ఉండేందుకు ఫ్రిజ్‌లో ఉంచుతాము. కానీ ఇది సరైనది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే చల్లదనం కారణంగా ఆహారంపై పొర ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఆహారం తక్కువ ఉష్ణోగ్రత కారణంగా దాని రుచి క్షీణిస్తుంది.
  2. తడి పాత్రలో ఆహారాన్ని ఉంచడం: మనం ఆహారాన్ని పాత్రలో ఉంచి ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే ఆ పాత్రలో నీరు లేదా దాని చుక్కలు లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే తడి కారణంగా ఆహారం చెడిపోతుంది. ముఖ్యంగా ఆకుకూరలు, కూరగాయలు కరగడం లాంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అవి చెడిపోతాయి. చూడడానికి బాగానే ఉన్నా.. తడి కారణంగా అందులో ఉండే పోషకాలు నశిస్తాయి.
  3. ఫ్రిడ్జ్ పూర్తిగా నింపడం: ఫ్రిజ్‌ కొన్ని ఆహార పదార్థాలు, కూరగాయలు పెట్టుకునేందుకు డస్ట్‌బిన్‌గా ఉపయోగించడం చేస్తే నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మంది ప్రజలు రిఫ్రిజిరేటర్‌ను ఆహార పదార్థాలతో నింపుతారు. దీని కారణంగా ఆహారం రుచి ఒకదానితో ఒకటి తేలికగా మిళితం అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి