AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Star Rating: కారుకున్న ఈ స్టార్ల గురుంచి మీకు తెలుసా? 5 స్టార్ ఉంటే లైఫ్ గ్యారెంటీనా!!

Car Star Rating: ఫ్రంట్ ఇంపాక్ట్ టెస్ట్ చాలా కీలకమైనది. ఏ కారుకైనా ముందు భాగం నుంచే ఎక్కువ శాతం యాక్సిడెంట్లు జరుగుతాయి. ఎం క్యాప్ లాబరేటరీ లో కూడా 54 కిలోమీటర్ల స్పీడుతో మొదలుపెట్టి కారుకున్న గరిష్ట స్పీడు వరకు రకరకాలుగా కృత్రిమ ప్రమాదాలు..

Car Star Rating: కారుకున్న ఈ స్టార్ల గురుంచి మీకు తెలుసా? 5 స్టార్ ఉంటే లైఫ్ గ్యారెంటీనా!!
Rakesh Reddy Ch
| Edited By: Subhash Goud|

Updated on: Nov 13, 2024 | 2:51 PM

Share

కొత్త కారు కొనాలంటే గతంలో ప్రతి ఒక్కరు మైలేజ్, ఫీచర్స్ గురించి ఆలోచించేవారు. కానీ కాలం మారింది. అన్నింటికంటే ముందు సేఫ్టీ రేటింగ్ గురించే అడుగుతున్నారు. అసలు కారుకు ఈ సేఫ్టీ రేటింగ్ ఏంటి? ఈ సేఫ్టీ రేటింగ్‌ని ఎవరు ఇస్తారు..? దాదాపు కార్లన్నింటికీ సేఫ్టీ రేటింగ్ ని గ్లోబల్ NCAP ఇచ్చే స్టార్స్ ఆధారంగానే పరిగణిస్తారు. NCAP అంటే న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రాం. కొత్త కార్లకి క్రష్ టెస్టులన్నీ లండన్, గ్రేట్ బ్రిటన్ లో ఉన్న ఎన్ క్యాప్ లేబరేటరీలలో టెస్ట్ చేస్తారు. కార్లను క్రాష్ టెస్ట్ చేసేటప్పుడు ప్రతి ఇంచునీ కెమెరాలు బంధిస్తారు. కొన్ని వందల మంది ఆటోమొబైల్ ఇంజనీర్లు, మెడికల్ నిపుణులు, క్రాష్ టెస్ట్ ఎక్స్పర్ట్స్ ఇందులో పాల్గొంటారు.

అసలు ఒక కార్ సేఫ్టీ రేటింగ్‌ని ఎలా నిర్ధారిస్తారు?

ప్రపంచంలో ఏ కార్ కంపెనీ అయినా తన కారుకు గ్లోబల్ ఎన్ క్యాప్ రేటింగ్ పొందాలంటే ఆ కారును వారి లాబరేటరీ కి పంపించాలి. ఆ కారులో ఇంజన్‌తో పాటు అన్ని విడిభాగాలు కస్టమర్లకు అందించేవే ఉండాలి. ఇక లేబరేటరీలో టెస్ట్ మొదలుపెడతారు.

మూడు రకాల సేఫ్టీ పరీక్షలు నిర్వహిస్తారు

  • ఒకటి ఫ్రంటల్ ఇంపాక్ట్
  • రెండవది సైడ్ ఇంపాక్ట్
  • మూడోది రోల్ ఓవర్

ఫ్రంట్ ఇంపాక్ట్ టెస్ట్ చాలా కీలకమైనది. ఏ కారుకైనా ముందు భాగం నుంచే ఎక్కువ శాతం యాక్సిడెంట్లు జరుగుతాయి. ఎం క్యాప్ లాబరేటరీ లో కూడా 54 కిలోమీటర్ల స్పీడుతో మొదలుపెట్టి కారుకున్న గరిష్ట స్పీడు వరకు రకరకాలుగా కృత్రిమ ప్రమాదాలు సృష్టించి కారు డ్యామేజ్ ని పరీక్షిస్తారు. ఇలా కృత్రిమ యాక్సిడెంట్లు చేస్తున్నప్పుడు అందులో మనుషులు లాంటి బొమ్మలను ఉంచుతారు. ముందు సీట్లో ఇద్దరు పెద్దవాళ్లు, వెనక సీట్లు చైల్డ్ సీట్, పక్కన టీనేజర్. ఇలా నాలుగు రకాల బొమ్మలను అందులో ఉంచుతారు. అవి కూడా సాధారణంగా మనుషులు ఉంటే బరువుతో ఉంచుతారు. క్రాష్ టెస్ట్ జరిగినప్పుడు ఏ స్పీడ్ లో ఏ సీట్లో కూర్చున్న వ్యక్తికి ఎంత డామేజ్ అయింది. ఎవరికి శరీర భాగాలు విరిగిపోయాయి. ప్రాణాపాయం ఎంతవరకు ఉందని సైంటిఫిక్ గా నిర్ధారిస్తారు.

ఇక సైడ్ ఇంపాక్ట్ కూడా అంతే.. కానీ ఇది 61 కిలోమీటర్ నుంచి 120 కిలోమీటర్ల వరకు మాత్రమే టెస్ట్ చేస్తారు. సాధారణంగా ఎస్‌యూవీ వెహికల్స్ కి ఎక్కువగా సైడ్ ఇంపాక్ట్ టెస్టు ఉంటుంది. ఇక చివరిది రోల్ ఓవర్ టెస్ట్.. ఇది కూడా చాలా ముఖ్యమైనది. కార్లకు అతిపెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు బోల్తా పడతాయి కదా అదే రోల్ ఓవర్ టెస్ట్. కారును రకరకాల వేగ పరిమితులలో బోల్తా కొట్టిస్తారు. కారు గ్లాస్ ఎప్పుడు పగిలింది.. అందులో ఉన్న మనుషులకు ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా ఎన్ని గాయాలు అవుతున్నాయి. ప్రాణాపాయం ఏ స్థాయి వరకు ఉందనేది గుర్తిస్తారు.

ఈ క్రష్ బెస్ట్ నిర్వహించేటప్పుడు ప్రతి అంగుళాన్ని గమనించేలా కారు లోపల బయట మైక్రో కెమెరాలు అమరుస్తారు. క్రాష్ టెస్ట్ నిర్వహిస్తున్నప్పుడు 27 పాయింట్లను అడల్ట్ సేఫ్టీ కోసం, 41 పాయింట్లను చైల్డ్ సేఫ్టీ కోసం సేకరిస్తారు. అన్నింటినీ కలిపి అది ఇప్పుడున్న స్టాండర్డ్స్ కి సరిపోతాయి అనుకుంటేనే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు. అయితే ఇక్కడ అందరూ గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మీరు కొన్న కారు ఫైవ్ స్టార్ రేటింగ్ కలిగింది అయినా సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మీకు మీకు చుక్కలే కనిపిస్తాయి. ప్రమాదమేనని గమనించాలి.

ఇది కూడా చదవండి: Tech Tips: ఇంట్లో Wi-Fi స్పీడ్‌ తగ్గిందా? ఈ ట్రిక్స్‌తో మరింత వేగం!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి