Samsung Galaxy S24: ఆ సామ్‌సంగ్ ఫోన్‌పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.20 వేల తగ్గింపు

భారతదేశంలో సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్లు అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా యువతలో సామ్‌సంగ్ ఫోన్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే మార్కెట్‌లో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ ఫోన్‌పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఈ ఫోన్‌పై రూ. 20,000 తగ్గింపును అందిస్తుంది.

Samsung Galaxy S24: ఆ సామ్‌సంగ్ ఫోన్‌పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.20 వేల తగ్గింపు
Samsung Galaxy S24
Follow us
Srinu

|

Updated on: Sep 14, 2024 | 3:32 PM

భారతదేశంలో సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్లు అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా యువతలో సామ్‌సంగ్ ఫోన్స్‌కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అయితే మార్కెట్‌లో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా సామ్‌సంగ్ తన గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ ఫోన్‌పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఈ ఫోన్‌పై రూ. 20,000 తగ్గింపును అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని 6.8 అంగుళాల ఎమో ఎల్ఈడీ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్, 200 ఎంపీ బ్యాక్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఏఐ ద్వారా పని చేస్తుంది. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ ఫోన్  పరిమిత కాల ఆఫర్‌లో భాగంగా కేవలం 1,09,999 రూపాయలకే అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వాస్తవానికి రూ.1,29,999 ప్రారంభ ధరతో ప్రారంభించారు. అయితే రూ. 8,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌తో పాటు రూ. 12,000 అదనపు అప్‌గ్రేడ్ బోనస్‌తో కలిపి రూ. 20,000 తగ్గింపు పొందవచ్చు. అలాగే వినియోగదారులు రూ. 12,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చని సామ్‌సంగ్ కంపెనీ వెల్లడించింది. అదనంగా మెరుగైన సరసతను కోరుకునే వినియోగదారులు 24 నెలల పాటు నో-కాస్ట్ ఈఎంఐ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ డీల్ అన్ని ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ టైటానియం గ్రే, టైటానియం వైలెట్, టైటానియం బ్లాక్, టైటానియం ఎల్లో కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా 5జీ 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ ప్లస్ డైనమిక్ ఎమోఎల్ఈడీ 2ఎక్స్ డిస్‌ప్లే, సూపర్ స్మూత్ 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఫ్లూయిడ్ యానిమేషన్‌ల వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. గెలాక్సీ ఎస్ 24 అల్ట్రా ప్రత్యేక కెమెరా సిస్టమ్ ఆకట్టుకుంటుంది. 120 డిగ్రీ ఎఫ్ఓవీతో 12 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా, ఓఐఎస్‌తో 200 ఎంపీ వైడ్ కెమెరా, 5 ఎక్స్, 3 ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఎంపికలతో టెలిఫోటో కెమెరాలు ఉన్నాయి. ముఖ్యంగా 12 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంది. ఈ ఫోన్ 12జీబీ + 1టీబీ, 12జీబీ + 512 జీబీ, 12 జీబీ + 256 జీబీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..