AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Redmi Note 13: ఆ ఎంఐ ఫోన్‌పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.3500 తగ్గింపు

భారతదేశంలో ఎంఐ ఫోన్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లతో ఎంఐ ఫోన్లు ఉంటాయనే విషయం అందరకీ తెలిసిందే. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎంఐ ఫోన్స్‌ను అధికంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మార్కెట్‌లో ఇతర కంపెనీలు కూడా క్రమేపి బడ్జెట్ ఫోన్స్ రిలీజ్ చేయడంతో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఎంఐ ఫోన్లు గట్టి పోటీను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐ ఫోన్స్‌లో సేల్స్‌పరంగా దుమ్ము దులుపుతున్న ఎంఐ నోట్ 13 5 జీ ఫోన్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Redmi Note 13: ఆ ఎంఐ ఫోన్‌పై బంపర్ ఆఫర్.. ఏకంగా రూ.3500 తగ్గింపు
Redmi Note 13 5g
Nikhil
|

Updated on: Aug 24, 2024 | 10:50 PM

Share

భారతదేశంలో ఎంఐ ఫోన్లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. తక్కువ ధరలో సూపర్ ఫీచర్లతో ఎంఐ ఫోన్లు ఉంటాయనే విషయం అందరకీ తెలిసిందే. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎంఐ ఫోన్స్‌ను అధికంగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే మార్కెట్‌లో ఇతర కంపెనీలు కూడా క్రమేపి బడ్జెట్ ఫోన్స్ రిలీజ్ చేయడంతో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో ఎంఐ ఫోన్లు గట్టి పోటీను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐ ఫోన్స్‌లో సేల్స్‌పరంగా దుమ్ము దులుపుతున్న ఎంఐ నోట్ 13 5 జీ ఫోన్‌పై బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్‌పై ఏకంగా రూ.3500 తగ్గింపును ప్రకటించింది. అయితే త్వరలోనే రెడ్‌మీ నోట్ 14 సిరీస్ రిలీజ్ అవుతుందనే వార్తల నేపథ్యంలో ఈ ఫోన్‌పై ఆఫర్ ప్రకటించారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ధరలోనే మంచి ఫీచర్స్‌తో స్మార్ట్ ఫోన్ కావాలంటే మాత్రం రెడ్‌మీ నోట్ -13 5 జీ ఫోన్‌ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో రెడ్‌మీ-13 5జీ స్మార్ట్ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలను తెలుసుకుందాం. 

తాజా తగ్గింపుతో రెడ్‌మీ నోట్-13 ఫోన్‌ను కేవలం రూ.16,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ అసలు ధర రూ.18,999. ఐసీఐసీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై ఫ్లాట్ రూ. 1,500 తగ్గింపు అందుబాటులో ఉంది. అందువ్లల ఈ ఫోన్‌ను కేవలం రూ.15,499కే సొంతం చేసుకోవచ్చు. అలాగే పాత ఫోన్ ఎక్స్చేంజ్‌పై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 13 స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్‌సెట్ ద్వారా ఆధారంగా పని చేస్తుంది. 12 జీబీ + 256జీబీ వేరియంట్‌లో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13లో పని చేస్తుంది. హైపర్ ఓఎస్ రెడ్ మీ నోట్ -13 ప్రత్యేకత. 

హైపర్ ఓఎస్ ద్వారా వినియోగదారులు వివిధ ఎంఐ ప్లాట్‌ఫారమ్‌లలో టాస్క్‌లను అప్రయత్నంగా కొనసాగించడానికి, ప్రత్యామ్నాయ పరికరాలలో కాల్‌లను స్వీకరించడానికి, స్మార్ట్‌ఫోన్ వెనుక కెమెరాను ల్యాప్‌టాప్ వెబ్‌క్యామ్‌గా ఉపయోగించడానికి, మొబైల్ డేటాను షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెడ్‌మి నోట్ 13 స్మార్ట్‌ఫోన్ 100 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో సహా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది.  33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి