Google polish feature: గూగుల్ నుంచి మరో అదిరే ఫీచర్.. ప్రొఫెషనల్ ఈ-మెయిల్ తయారు చేయడం చాలా సులభం

ప్రస్తుతం ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) చర్చనీయాంశమైంది. మనిషికి అన్ని రకాలుగా ఉపయోగపడే ఏఐ భవిష్యత్తులో చాలా కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత అనేక ఫీచర్లను వివిధ కంపెనీలు తయారు చేస్తున్నాయి. వాటి ద్వారా తమ యూజర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నాయి.

Google polish feature: గూగుల్ నుంచి మరో అదిరే ఫీచర్.. ప్రొఫెషనల్ ఈ-మెయిల్ తయారు చేయడం చాలా సులభం
Gmail
Follow us
Srinu

|

Updated on: Aug 24, 2024 | 9:15 PM

ప్రస్తుతం ప్రపంచంలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) చర్చనీయాంశమైంది. మనిషికి అన్ని రకాలుగా ఉపయోగపడే ఏఐ భవిష్యత్తులో చాలా కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత అనేక ఫీచర్లను వివిధ కంపెనీలు తయారు చేస్తున్నాయి. వాటి ద్వారా తమ యూజర్లకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి చర్యలు తీసుకుంటున్నాయి. దీనిలో భాగంగా గూగుల్ కంపెనీ కూడా ఏఐ ఆధారిత ఫీచర్లను డెవలప్ చేసింది. గూగుల్ జెమిని పేరుతో అత్యంత అడ్వాన్స్ డ్ వెర్షన్ ఏఐ మెడల్ ను ఆవిష్కరించింది. దీని ద్వారా అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవలే ఏఐ ఆధారిత పోలిష్ ఫీచర్ ను వినియోగదారులకు పరిచయం చేసింది. వెబ్, మొబైల్ పరికరాల ద్వారా వినియోగదారులు తమ ఇమెయిల్ లను మెరుగుపర్చకోవడానికి సాయపడుతుంది.

పోలిష్ ఫీచర్

గూగుల్ సంస్థ జీమెయిల్ కోసం కొత్త పోలిష్ ఫీచర్ ను విడుదల చేసింది. తన జెమినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మోడల్‌ ఆధారంగా దీన్ని రూపొందించింది. జీమెయిల్ లో ఇప్పటికే ఉన్న హెల్ప్ మీ రైట్ అనే ఫీచర్ కు దీన్ని కొత్త అప్ డేట్ అని చెప్పవచ్చు. ఆ ఫీచర్ మరింత సమర్థంగా పనిచేసేందుకు ఇది సహాయ పడుతుంది. రఫ్ నోట్స్ ఆధారంగా పూర్తి అధికారిక ఇమెయిల్ డ్రాఫ్ట్‌లను రూపొందించడం చాలా సులువు. ఈ కొత్త ఫీచర్ మొబైల్ పరికరాల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు హెల్ప్ మీ రైట్ లో సాయపడేందుకు రిఫైన్ ఫీచర్ కోసం షార్ట్‌కట్‌ను కూడా అందజేసింది. ఈ ఫీచర్లన్నీ జెమిని ఏఐ చెల్లింపు చందాదారులకు అందుబాటులో ఉన్నాయి. గూగుల్ కు చెందిన జీమెయిల్ లో ఇప్పటికే హెల్ప్ మీ రైట్ అనే ఫీచర్ ఉంది. దాన్ని పోలిష్, రిఫైన్ మై షార్ట్ కట్ అనే కొత్త అప్ డేట్లు మరింత మెరుగుపరుస్తాయి.

రెండు కొత్త సాధనాలు

గూగుల్ వర్క్ స్పేస్ బ్లాగ్ లో తెలిపిన వివరాల ప్రకారం ఏఐ ఆధారిత హెల్ప్ మీ రైట్ ఫీచర్‌లో భాగంగా రెండు కొత్త సాధనాలను ప్రకటించారు. రైటింగ్ అసిస్టెంట్, జెమిని ఏఐ సామర్థ్యాలను ఉపయోగించి ఇమెయిల్‌లను రూపొందించవచ్చు. వాటిని మెరుగుపర్చుకోవచ్చు. హెల్ప్ మి రిఫైన్ ఆప్షన్ గతంలోనే వెబ్‌లో అందుబాటులో ఉంది. దాన్ని ఇప్పుడు మరింత అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రత్యేక మార్కుతో ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు పరిచయం చేశారు. ఇప్పటికే ఉన్న ఇమెయిల్ డ్రాఫ్ట్‌ని తీసుకొని, దానిని మెరుగుపరచడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ రిఫైన్ ఫీచర్ కు పోలిష్ కొత్తగా కలిసింది. అయితే టెక్స్ట్ ఫీల్డ్‌లో కనీసం 12 పదాలు రాసినప్పుడు మాత్రమే ఈ ఫీచర్ యాక్లివేట్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

12 పదాలు దాటితేనే..

మొబైల్ పరికరంలో యూజర్లు 12 పదాలు లేదా అంతకంటే ఎక్కువ టైప్ చేసిన తర్వాత రిఫైన్ మై డ్రాప్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. పైన పేర్కొన్న అన్ని ఎంపికలతో దిగువ షీట్‌ను తెరవడానికి వినియోగదారులు దీన్ని కుడి వైపు స్వైప్ చేయవచ్చు. టైప్ చేసిన పదాలను ప్రాంప్ట్‌గా ఉపయోగించగలిగే డ్రాఫ్ట్ రాయండి అనే ఎంపిక కూడా ఉంది. అక్కడ నుండి ఇమెయిల్‌ను కొనసాగించవచ్చు. గూగుల్ తీసుకువచ్చిన కొత్త ఫీచర్లు జెమిని బిజినెస్, ఎంటర్‌ప్రైజ్ యాడ్-ఆన్, జెమినీ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ప్రీమియం యాడ్-ఆన్, గూగుల్ వన్ ఏఐ ప్రీమియం ప్లాన్‌కు సభ్యత్వం పొందిన గూగుల్ వర్స్ స్పేస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!