5G phones under 15k: అత్యంత తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్లు.. రూ.15 వేలలోపే ప్రముఖ మోడళ్లు..
కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దాని ధర ఎంత ఉంటుందని ఆలోచిస్తున్నారా? మీ బడ్జెట్ గురించి ఆందోళన చెందుతున్నారా..? అయితే మీకో శుభవార్త. అత్యంత తక్కువ ధరకు మార్కెట్ లో 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ప్రముఖ కంపెనీలు విడుదల చేసిన లేటెస్ట్ ఫోన్లే. వాటి ధర కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంది.
కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దాని ధర ఎంత ఉంటుందని ఆలోచిస్తున్నారా? మీ బడ్జెట్ గురించి ఆందోళన చెందుతున్నారా..? అయితే మీకో శుభవార్త. అత్యంత తక్కువ ధరకు మార్కెట్ లో 5జీ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా ప్రముఖ కంపెనీలు విడుదల చేసిన లేటెస్ట్ ఫోన్లే. వాటి ధర కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంది. కేవలం రూ.15 వేల లోపు ధరలోనే అత్యుత్తమ ఫీచర్లు కలిగిన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మంచి బ్యాటరీ బ్యాకప్, స్టోరేజీ కెపాసిటీ, కెమెరా నాణ్యత కలిగిన వీటి ప్రత్యేకతలు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.
ఐక్యూజెడ్9ఎక్స్
ఐక్యూజెడ్9ఎక్స్ ఫోన్ లో స్నాప్ డ్రాగ్ 6 జెన్ 1 చిప్ ఏర్పాటు చేశారు. ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది. 6.7 అంగుళాల డిస్ ప్లే కారణంగా విజువల్ ను స్పష్టంగా చూడవచ్చు. దీనిలో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ రూ.14,999కు అందుబాటులో ఉంది.
ఒప్పో కె12ఎక్స్
ఒప్పో కె12ఎక్స్ తక్కువ ధరకు లభిస్తున్న 5జీ స్మార్ట్ ఫోన్. దీనిలోని మీడియా టెక్ డైమన్సిటీ 6300 ప్రాసెసర్ తో పనితీరు బాగుంటుంది. 32 ఎంపీ ప్రైమరీ కెమెరా, 45 డబ్ల్యూ పాస్ట్ చార్జింగ్ కు మద్దతు బ్యాటరీ దీని ప్రత్యేకతలు. ఈ ఫోన్ ధర కేవలం రూ.12,999.
రియల్ మీ నార్జో 70 5జీ
రియల్ మీ నార్జో 70 5జీ ఫోన్ లోని 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ ప్లేతో పిక్చర్ స్పష్టంగా కనిపిస్తుంది.. మీడియా టెక్ డైమన్సిటి 7059 చిప్ సెట్ తో పనితీరు వేగంగా ఉంటుంది. అలాగే 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 45 డబ్ల్యూ చార్జింగ్ సపోర్టు చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ దీని అదనపు ప్రత్యేకతలు. ఈ ఫోన్ రూ.13,999కు అందుబాటులో ఉంది.
మోటరోలా జీ34 5జీ
మోటరోలా జీ34 5జీ ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్ సెట్ అమర్చారు. 8 జీబీ ర్యామ్ కారణంగా పనితీరు మెరుగ్గా ఉంటుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఫొటోలు నాణ్యంగా తీసుకోవచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో చార్జింగ్ సమస్యలు ఉండవు. దీని ధర రూ.11,999
రెడ్ మీ 13సీ
రెడ్ మీ 13సీ ఫోన్ లో డ్యూయల్ సిమ్ 5జీ సెటప్ ఉంది. ఇది మీడియాటెక్ డైమన్సిటీ 6100+ చిప్ తో పనిచేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అదనపు ప్రత్యేకతలు. ఈ ఫోన్ ధర రూ.10,499.
రియల్ మీ 12ఎక్స్ 5జీ
రియల్ మీ 12ఎక్స్ 5జీలో మీడియా టెక్ డైమన్సిటీ 6100+ చిప్ సెట్ అమర్చారు. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. అలాగే 4 జీబీ ర్యామ్ తో పాటు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ రూ.11,999కు అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి