Telegram: టెలిగ్రామ్ సీఈఓ అరెస్ట్.. ఎందుకో తెలుసా.?
మీడియా కథనాల ప్రకారం.. టెలిగ్రామ్ యాప్‌కు సంబంధించిన కేసులో అతన్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్‌లో మోడరేటర్లు లేరన్న విషయంపై ఫ్రెంచ్ పోలీసులు తమ దర్యాప్తును కేంద్రీకరించారు. మోడరేటర్లు లేకపోవడం వల్ల మెసేజింగ్ యాప్‌లో నేర కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు...
టెలిగ్రామ్.. ఈ మెసేజింగ్ యాప్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. వాట్సాప్ తర్వాత ఎక్కువగా ఉపయోగించే మెసేజింగ్ యాప్‌గా దీనికి పేరుంది. తాజాగా ఈ మెసేజింగ్ యాప్ సీఈవో పావెల్ దురోవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పావెల్‌ను శనివారయం సాయంత్రం పారిస్‌లో ఉన్న బోర్గెడ్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రైవేట్ జెట్‌లో ఎయిర్ పోర్టుకు చేరుకున్న పావెల్‌ను అరెస్ట్ చేసినట్లు సమాచారం.
మీడియా కథనాల ప్రకారం.. టెలిగ్రామ్ యాప్‌కు సంబంధించిన కేసులో అతన్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. టెలిగ్రామ్‌లో మోడరేటర్లు లేరన్న విషయంపై ఫ్రెంచ్ పోలీసులు తమ దర్యాప్తును కేంద్రీకరించారు. మోడరేటర్లు లేకపోవడం వల్ల మెసేజింగ్ యాప్‌లో నేర కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. దురోవ్ అజర్ బైజాన్ నుంచి శనివారం ఫ్రాన్స్‌కు చేరుకున్న సమయంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ విషయంమై టెలిగ్రామ్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే అటు పోలీసులు కూడా దీనికి సంబంధంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి యుద్ధం చుట్టూ నెలకొన్న రాజకీయాలకు సంబంధించి టెలిగ్రామ్ వేదికగా పెద్ద ఎత్తున ఉత్తరప్రత్యుత్తరాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక ఉక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ, అతని అధికారులకు మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ అత్యంత ముఖ్యమైన కమ్యూనికేషన్ మాధ్యమమని చెబుతుంటారు.
క్రెమ్లిన్, రష్యా ప్రభుత్వం కూడా వార్తలను పంచుకోవడానికి టెలిగ్రామ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయని వార్తలు వచ్చాయి. రష్యా యుద్ధానికి సంబంధించి సమాచారం టెలిగ్రామ్‌లో పెద్ద ఎత్తున లభించిందనే ప్రచారం జరిగింది. ఇక టెలిగ్రామ్ యాప్ విషయానికొస్తే.. దుబాయ్ కేంద్రంగా పనిచేసే ఈ యాప్‌ను రష్యాకు చెందిన దురోవ్ స్థాపించారు. కొన్ని రకాల ప్రభుత్వ డిమాండలను అంగీకరించడానికి నిరాకరించి దురోవ్ 2014 తర్వాత రష్యాను వీడారు. రష్యా, ఉక్రెయిన్‌తో పాటు సోవియట్ దేశాల్లో ఈ యాప్‌ను పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..