BSNL: సిమ్ అప్‌గ్రేడ్ చేసుకునే వారికి బీఎస్‌ఎన్‌ఎల్ బంపరాఫర్.. ఉచితంగా డేటా..
త్వరలోనే బీఎస్ఎన్‌ఎల్ 4జీ సేవలను ప్రారంభిస్తున్న తరుణంలో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. 4జీ సిమ్‌కు అప్‌డేట్ అయిన వారికి బీఎస్‌ఎన్‌ఎల్ 4జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ డేటాను మూడు నెలల పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. పాత సిమ్‌ను ఉపయోగిస్తున్న వారు దగ్గరల్లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌కు లేదా, రిటైలర్ వద్ద ఐడీ ప్రూఫ్స్‌ను అందించి ఉచితంగా సిమ్ కార్డును పొందొచ్చు...

ప్రముఖ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) తమ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. త్వరలోనే 4జీ నెట్‌వర్క్‌కు అప్‌గ్రేడ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం 2జీ/3జీ సిమ్ కార్డులను ఉపయోగిస్తున్న వారిని 4జీ సిమ్ కార్డుకు అప్‌గ్రేడ్ అయ్యేలా ప్రోత్సహించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఆఫర్‌ను ప్రకటించింది.
త్వరలోనే బీఎస్ఎన్‌ఎల్ 4జీ సేవలను ప్రారంభిస్తున్న తరుణంలో ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. 4జీ సిమ్‌కు అప్‌డేట్ అయిన వారికి బీఎస్‌ఎన్‌ఎల్ 4జీబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ డేటాను మూడు నెలల పాటు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. పాత సిమ్‌ను ఉపయోగిస్తున్న వారు దగ్గరల్లోని బీఎస్‌ఎన్‌ఎల్ ఆఫీస్‌కు లేదా, రిటైలర్ వద్ద ఐడీ ప్రూఫ్స్‌ను అందించి ఉచితంగా సిమ్ కార్డును పొందొచ్చు.
ఒకవేళ మీరు ఉపయోగిస్తుంది పాత సిమ్ కార్డో, కొత్తదో తెలుసుకోవడానికి బీఎస్‌ఎన్‌ఎల్ ఆప్షన్‌ను అందించింది. ఇందుకోసం మీ మొబైల్ ఫోన్ నుంచి ‘SIM’ అని 54040 నెంబర్‌కు మెసేజ్ చేయాలి. వెంటనే మీరు ఉపయోగిస్తున్న సిమ్ వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి. ఒకవేళ పాత సిమ్ కార్డు అయితే కొత్తదానికి అప్‌గ్రేడ్ కావొచ్చు. దీంతో 4జీ ఉచిత డేటాతో పాటు 4జీ నెట్‌వర్క్‌కి సిమ్ అప్‌గ్రేడ్ అవుతుంది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3జీ సేవలు అందిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్ త్వరలోనే 4జీ సేవలను ప్రారంభించనుంది. ఈ ఏడాది చివరి నాటికి పంజాబ్‌లో 4జీ సేవలను ప్రారంభించనున్నారు. ఇక వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ వెంటనే 5జీ సేవలను విస్తరించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సన్నాహాలు చేయనుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




