- Telugu News Photo Gallery Technology photos Apple launches new pencil in india Apple pencil 3 features and price details
Apple Pencil 3: ఈ పెన్సిల్ ధర రూ. 8 వేలు.. అంత ప్రత్యేకత ఏంటనేగా..
యాపిల్ ప్రొడక్ట్స్‌కు టెక్ మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్రాండ్ నుంచి ఏదైనా కొత్త ప్రొడక్ట్ వస్తుందంటే చాలు మార్కెట్లో సందడి మాములుగా ఉండదు. ఇలాంటి యాపిల్ బ్రాండ్ నుంచి తాజాగా నెక్ట్స్ జనరేషన్ పెన్సిల్ వచ్చింది. యాపిల్ పెన్సిల్ 3 పేరుతో ఈ కొత్త పెన్సిల్‌ను లాంచ్ చేసింది యాపిల్. ఇంతకీ ఈ పెన్సిల్‌లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం...
Updated on: Nov 06, 2023 | 2:28 PM

ప్రముఖ టెక్ కంపెనీ యాపిల్.. పెన్సిల్ 3 పేరుతో కొత్త తరం పెన్సిల్‌ను లాంచ్ చేసింది. యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌తో ఈ పెన్సిల్ సపోర్ట్ చేస్తుంది. స్లైడింగ్ క్యాప్ డిజైన్‌తో ఈ పోర్ట్‌ను అందించారు.

ఈ పెన్సిల్‌ను ఐప్యాడ్‌కు చాలా సులభంగా పెయిర్ చేసుకోవచ్చు. అలాగే ఐప్యాడ్ సైడ్ ఎడ్జ్‌కు ఈ పెన్సిల్‌ను సురక్షితంగా అటాచ్ చేయవచ్చు. ఈ పెన్సిల్‌లో సెన్సిటివిటీ, వైర్‌లెస్ పెయిరింగ్, ఛార్జింగ్, డబుల్ ట్యాప్ ఫంక్షన్ వంటి ఫీచర్లను అందించారు.

ధర విషయానికొస్తే యాపిల్ పెన్సిల్ 3 ధర భారత మార్కెట్లో రూ. 7,900గా నిర్ణయించారు. భారత్‌లో ఈ పెన్సిల్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. యాపిల్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయొచ్చు.

యాపిల్ నుంచి గతంలో వచ్చిన 10వ తరం పెన్సిల్‌లో పోల్చితే దీని ధర చాలా తక్కువ. యాపిల్ దీని ముందు వెర్షన్ పెన్సిల్‌ను గత సంవత్సరం రూ. 11,900 ధరతో మార్కెట్లో లాంచ్ చేసింది.

ఇక యాపిల్ 3 ని ఐప్యాడ్ ప్రో వంటి యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌తో కూడిన అనేక ఐప్యాడ్ మోడల్స్‌ను ఇది సపోర్ట్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఎడ్యుకేషన్ ప్లాన్ కింద విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఈ కొత్త యాపిల్ పెన్సిల్ 3 రూ.6,999కే సొంతం చేసుకోవచ్చు.





























