Best Phones Under 20K: అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు ఇవే.. చవకైన ధర, సూపర్ పనితీరు..

పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా ఫోన్ ధరను బట్టి అందులోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉంటాయి. అయితే మరీ అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అనువైన బడ్జెట్లోనే బెస్ట్ ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. రూ. 20,000 పెట్టగలిగితే హై ఎండ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో రూ. 20,000 లోపు ధరలో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లను ఇప్పుడు చూద్దాం..

Best Phones Under 20K: అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్లు ఇవే.. చవకైన ధర, సూపర్ పనితీరు..
Smartphones
Follow us
Madhu

| Edited By: Venkata Chari

Updated on: Nov 21, 2023 | 10:14 PM

ప్రపంచం స్మార్ట్ అడుగులు వేస్తోంది. ప్రతీది డిజిటల్ మయం అయిపోతోంది. అందుకు స్మార్ట్ ఫోన్ అనివార్యం అవుతోంది. ప్రతి ఒక్కరి చేతిలో ఓ స్మార్ట్ ఉండాల్సిందే. లేకుంటే ముందుకు కదల్లేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో సాధారణంగానే టెక్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. పిండి కొద్దీ రొట్టె అన్నట్లుగా ఫోన్ ధరను బట్టి అందులోని ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉంటాయి. అయితే మరీ అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అనువైన బడ్జెట్లోనే బెస్ట్ ఫీచర్లున్న స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. రూ. 20,000 పెట్టగలిగితే హై ఎండ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్లో రూ. 20,000 లోపు ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్లను ఇప్పుడు చూద్దాం..

వన్ ప్లస్ నోర్డ్ సీఈ 3 లైట్ 5జీ.. ఇది క్లాసీ ఎడ్జ్ లుక్ లో ఉంటుంది. 6.72 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. వెనుకవైపు 108ఎంపీ, 2ఎంపీ, 2ఎంపీ కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో ఉంటుంది. ఆండ్రాయిడ్ 13.1 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్ పై పనిచేస్తుంది. దీని ధర అమెజాన్ లో రూ. 19,999గా ఉంది.

రియల్ మీ నార్జో 60 5జీ.. గేమింగ్ కావాలనుకునే వారికి తక్కువ ధరలో అందుబాటులో ఉన్న బెస్ట్ ఎంపిక ఇది. 6.43 అంగుళాల 90హెర్జ్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6020 5జీ చిప్ సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్ తో పాటు 128జీబీ, 256జీబీ స్లోరేజ్ ఆప్షన్లతో ఉంటుంది. వెనుకవైపు 64ఎంపీ, ముందు వైపు 16ఎంపీ కెమెరా ఉంటుంది. బ్యాటరీ 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో వస్తుంది. రియల్ మీ యూఐ4, ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర అమెజాన్ లో రూ. 17,999గా ఉంది.

ఇవి కూడా చదవండి

వన్ ప్లస్ నోర్డ్ సీఈ2 లైట్ 5జీ.. వన్ ప్లస్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ ఇది. దీనిలో 6.59 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. 64ఎంపీ వెనుకవైపు కెమెరా, ముందు వైపు 16ఎంపీ కెమెరాతో వస్తుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12, ఆక్సిజన్ ఓఎస్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 17,999గా ఉంది.

రియల్ మీ నార్జో 60ఎక్స్ 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్ 6.72 అంగుళాల డైనమిక్ అల్ట్రా స్మూత్ డిస్ ప్లేతో వస్తుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ 5జీ చిప్ సెట్ తో వస్తుంది. 4జీబీ, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. వెనుక వైపు 50ఎంపీ, 2ఎంపీ, 5ఎంపీ కెమెరాలు ఉంటాయి. ముందు వైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ స్మామర్థ్యంతో బ్యాటరీ ఉంటాయి. ఆండ్రాయిడ్ 13, రియల్ మీ యూఐ 4.0 ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర రూ. 14,499గా ఉంది.

టెక్నో పోవా 5 ప్రో 5జీ.. గత సెప్టెంబర్లో విడుదలైన ఈ హ్యాండ్ సెట్ మంచి ఫీడ్ బ్యాక్ సంపాదించుకుంది. దీనిలో 6.78 అంగుళాల డిస్ ప్లే ఉంటుంది. డైమెన్సిటీ 6080 చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ, 256జీబీ స్టోరేజ్ సాయంతో పనిచేస్తుంది. 50ఎంపీ వెనుకవైపు కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధర రూ.15,999గా ఉంది.

రెడ్ మీ నోట్ 12 5జీ.. ఈ స్మార్ట్ ఫోన్లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ సామర్థ్యంతో వస్తుంది. ముందు వైపు 13ఎంపీ కెమెరాతో వస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్1 ప్రాసెసర్ ఉంటుంది. ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్ తో వస్తుంది. దీని ధర రూ. 11,999గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఇషా అంబానీ బంగ్లాను కొన్న హాలీవుడ్ స్టార్ కపుల్.. ఎన్ని కోట్లంటే?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
ఈ సీఎం సాబ్ గారి భార్య బాలీవుడ్‌లో స్టార్ సింగర్ అని తెలుసా?
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
రైఫిల్ గురిపెట్టిన సీఎం రేవంత్.. టార్గెట్ అస్సలు మిస్ అవ్వదు!
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
సూర్యునిపై యూరప్ తాజా అధ్యయనం.. ఇస్రో ప్రయోగానికి తేడా ఇదే..
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
ఆధార్ కార్డులో సాహా బ్యూటీ శ్రద్ధా కపూర్ ఎలా ఉందో చూశారా? వీడియో
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
రేవతి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటా: అల్లు అర్జున్
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
‘భారతీయ వాయుయాన్‌ విధేయక్‌’ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం..
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అయ్యో చిట్టి తల్లి!.. పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తల.. 
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
అతడి యాక్టింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?
చలికాలంలో పిల్లలకు అరటిపండు ఇవ్వడం సరైనదా.. కాదా?