జహీర్ vs పాండ్యా: హార్దిక్‌ ట్వీట్‌కు జహీర్‌ స్ట్రాంగ్ కౌంటర్‌!

టీమిండియా క్రికెటర్లలో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ హార్దిక్‌ పాండ్యా. తాను చేసే పనులతో ప్రతీసారి వార్తల్లో హైలెట్‌ నిలుస్తాడు. తాజాగా మాజీ పేసర్ జహీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. సోమవారం జహీర్‌ఖాన్‌ 41వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ హార్ధిక్ పాండ్యా ఓ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై జహీర్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Happy birthday Zak … Hope you […]

జహీర్ vs పాండ్యా: హార్దిక్‌ ట్వీట్‌కు జహీర్‌ స్ట్రాంగ్ కౌంటర్‌!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Oct 09, 2019 | 1:17 PM

టీమిండియా క్రికెటర్లలో వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌ హార్దిక్‌ పాండ్యా. తాను చేసే పనులతో ప్రతీసారి వార్తల్లో హైలెట్‌ నిలుస్తాడు. తాజాగా మాజీ పేసర్ జహీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. సోమవారం జహీర్‌ఖాన్‌ 41వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ హార్ధిక్ పాండ్యా ఓ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై జహీర్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జహీర్‌ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా పాండ్యా తన ట్విట్టర్‌లో “హ్యాపీ బర్త్‌డే జాక్‌.. నేనిక్కడ కొట్టినట్టు నువ్వు కూడా మైదానం బయటికి దంచి కొడతావనే ఆశిస్తున్నా” అంటూ కామెంట్ పెడుతూ ఓ దేశవాళీ క్రికెట్‌ సందర్భంగా జహీర్‌ఖాన్‌ బౌలింగ్‌లో తాను కొట్టిన సిక్స్‌ వీడియోని పాండ్యా పోస్టు చేశాడు.

పాండ్యా ట్వీట్‌పై జహీర్‌ ఖాన్‌ అభిమానులు ఘాటుగా విమర్శిస్తున్నారు. “ముందు నువ్వు మైదానంలో సరిగ్గా ఆడు, టీవీషోల్లో మర్యాదగా మాట్లాడటం నేర్చుకో,  జహీర్‌ ఖాన్‌లా భారత్‌కు వరల్డ్‌కప్ అందించు” లాంటి విమర్శలు చేయడంతో పాటు అహంకారం ప్రదర్శించకుండా మర్యాదగా వ్యవహరించాలని పాండ్యాకు చురకలు అంటించారు.

ఇక, పాండ్యా ట్వీట్‌కు జహీర్ ఖాన్ తనదైన శైలిలో స్పందించాడు. “ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందకు హార్దిక్‌కు ధన్యవాదాలు. అయితే నీలా బ్యాటింగ్‌ నేనెప్పటికీ చేయలేను. కానీ ఈ మ్యాచ్‌లో నువ్వు నా నుంచి ఎదుర్కొన్న ఆ తర్వాతి బంతి వల్లే నా పుట్టినరోజు బాగా జరిగింది” అంటూ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇటీవలే లండన్‌లో వెన్నునొప్పి గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్న హార్దిక్‌ ప్రస్తుతం కోలుకుంటున్నాడు.