ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్… రోహిత్ కెరీర్‌లోనే బెస్ట్
సౌతాఫ్రికాతో విశాఖపట్నం టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో దుమ్ము రేపిన రోహిత్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అతను 36 స్థానాల్ని మెరుగుపర్చుకొని 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. వైజాగ్ టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇతనికి జోడీగా ఆడిన మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ర్యాంకూ మెరుగైంది. అతను 38 స్థానాల్ని మెరుగుపర్చుకొని కెరీర్ […]
సౌతాఫ్రికాతో విశాఖపట్నం టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలతో దుమ్ము రేపిన రోహిత్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకుపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అతను 36 స్థానాల్ని మెరుగుపర్చుకొని 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. వైజాగ్ టెస్టులో అతను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలతో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇతనికి జోడీగా ఆడిన మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ర్యాంకూ మెరుగైంది. అతను 38 స్థానాల్ని మెరుగుపర్చుకొని కెరీర్ బెస్ట్ 25వ ర్యాంకులో నిలిచాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లి రెండో స్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ 900 రేటింగ్ పాయింట్ల దిగువన పడిపోయాడు. గతేడాది జనవరి నుంచి 900 పైబడిన రేటింగ్ పాయింట్లతో ఉన్న కోహ్లి ఖాతాలో ఇప్పుడు 899 పాయింట్లున్నాయి. టాప్ ర్యాంకులో ఉన్న స్టీవ్ స్మిత్ (937, ఆస్ట్రేలియా) కంటే 38 పాయింట్లు తక్కువ ఉన్నాయి. టెస్టు బౌలర్ల జాబితాలో మళ్లీ భారత స్పిన్నర్ అశ్విన్ టాప్–10లోకి చేరాడు. తొలి టెస్టులో 8 వికెట్లు తీయడం ద్వారా 4 స్థానాల్ని మెరుగుపర్చుకొని పదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఐసీసీ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భాగమైన ఈ సిరీస్‌లో భారత్ తొలి టెస్టు విజయంతో 40 పాయింట్లను ఖాతాలో వేసుకొని మొత్తం 160 పాయింట్లతో ఉంది. విండీస్‌పై 2–0తో గెలవడం ద్వారా 120 పాయింట్లను పొందింది.