గ్లోబల్ కెనడా టీ20లో యువీ జోరు!

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవల గుడ్‌బై చెప్పిన టీమిండియా సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ ప్రస్తుతం గ్లోబల్ కెనడా టీ20లో ఆడుతున్నాడు. టొరంటో నేషనల్స్‌కు సారథ్యం వహిస్తున్న యువీ శనివారం ఎడ్మంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. వాంకోవర్ నైట్స్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో విఫలమైన యువరాజ్ శనివారం నాటి మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. 21 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. యువీ చెలరేగడంతో టొరంటో నేషనల్స్ జట్టు రెండు వికెట్ల తేడాతో […]

గ్లోబల్ కెనడా టీ20లో యువీ జోరు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 29, 2019 | 4:29 AM

అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవల గుడ్‌బై చెప్పిన టీమిండియా సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ ప్రస్తుతం గ్లోబల్ కెనడా టీ20లో ఆడుతున్నాడు. టొరంటో నేషనల్స్‌కు సారథ్యం వహిస్తున్న యువీ శనివారం ఎడ్మంటన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. వాంకోవర్ నైట్స్‌తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో విఫలమైన యువరాజ్ శనివారం నాటి మ్యాచ్‌లో వీరవిహారం చేశాడు. 21 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 35 పరుగులు చేశాడు.

యువీ చెలరేగడంతో టొరంటో నేషనల్స్ జట్టు రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎడ్మంటన్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం 192 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టొరంటో జట్టు 17.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.