వరల్డ్‌కప్‌లో పాండ్యాది ‘కీ’ రోల్: యువీ

ముంబయి: వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కీలకంగా మారతాడని సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ అభిప్రాయపడ్డాడు. బ్యాటుతో పాటు బంతితో రాణించి టీంలో ‘కీ’ రోల్ పోషిస్తాడని అన్నాడు.  ప్రపంచకప్‌లో ఐదుగురు ఫీల్డర్ల రూల్ ఉంటుందని, పార్ట్‌టైమ్‌ బౌలర్లకు ఇబ్బంది అవుతుందని యూవీ అన్నాడు. ఒకవేళ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే వేరొకరు నాలుగైదు ఓవర్లు వెయ్యాల్సి వస్తుందని చెప్పాడు. అయితే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా ఉండే హార్దిక్‌ పాండ్యా మంచి ప్రదర్శన చేస్తాడని యువీ పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్‌తో […]

వరల్డ్‌కప్‌లో పాండ్యాది 'కీ' రోల్: యువీ
Follow us

|

Updated on: May 20, 2019 | 12:51 PM

ముంబయి: వరల్డ్‌కప్‌లో టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కీలకంగా మారతాడని సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌సింగ్‌ అభిప్రాయపడ్డాడు. బ్యాటుతో పాటు బంతితో రాణించి టీంలో ‘కీ’ రోల్ పోషిస్తాడని అన్నాడు.  ప్రపంచకప్‌లో ఐదుగురు ఫీల్డర్ల రూల్ ఉంటుందని, పార్ట్‌టైమ్‌ బౌలర్లకు ఇబ్బంది అవుతుందని యూవీ అన్నాడు. ఒకవేళ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగితే వేరొకరు నాలుగైదు ఓవర్లు వెయ్యాల్సి వస్తుందని చెప్పాడు. అయితే ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్‌గా ఉండే హార్దిక్‌ పాండ్యా మంచి ప్రదర్శన చేస్తాడని యువీ పేర్కొన్నాడు.

ముంబయి ఇండియన్స్‌తో ఆడేటప్పుడు తాను పాండ్యతో మాట్లాడానని చెప్పాడు. పాండ్యాతో మాట్లాడుతూ ‘నీకు ప్రపంచకప్‌లో మంచి అవకాశం వచ్చింది. బంతితో పాటు బ్యాట్‌తో రాణించొచ్చు’ అని చెప్పా యువీ తెలిపాడు. ఐపీఎల్‌లో కూడా పాండ్యా మంచి ప్రదర్శన కనబరిచాడని, వికెట్లు తీశాడని గుర్తుచేశాడు. తాను చెప్పినట్టు ఒత్తిడిని తట్టుకుంటే సరిపోతుందని అన్నాడు. అలాగే ప్రపంచకప్‌లో స్పిన్‌ బౌలింగే మన సత్తా అని తేల్చిచెప్పాడు.