ఇంగ్లాండ్ కౌంటీలకు అశ్విన్..!

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లాండ్ పయనమయ్యాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదలు కానున్న తరుణంలో బౌలింగ్‌ను సానబెట్టడానికి కౌంటీలు ఆడనున్నాడు. ఈ మేరకు నాటింగ్‌హామ్‌షైర్‌ తరపున ఆరు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ‘ఔను.. అశ్విన్‌ ఈ కౌంటీ సీజన్‌లో నాటింగ్‌హామ్‌షైర్‌ తరపున బరిలోకి దిగుతాడు. పరిపాలక కమిటీ (సీఓఏ) ఇప్పటికే సెంట్రల్‌ కాంట్రాక్టు క్రికెటర్లకు కౌంటీలాడేందుకు గ్రీన్‌ సిగ్నలిచ్చింది.అశ్విన్‌ ఒప్పందం ఇప్పటికే ఖరారైంది. రేపోమాపో బోర్డు సీఈఓ నిరభ్యంతర పత్రం […]

ఇంగ్లాండ్ కౌంటీలకు అశ్విన్..!
Follow us

|

Updated on: May 20, 2019 | 12:47 PM

భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఇంగ్లాండ్ పయనమయ్యాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదలు కానున్న తరుణంలో బౌలింగ్‌ను సానబెట్టడానికి కౌంటీలు ఆడనున్నాడు. ఈ మేరకు నాటింగ్‌హామ్‌షైర్‌ తరపున ఆరు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ‘ఔను.. అశ్విన్‌ ఈ కౌంటీ సీజన్‌లో నాటింగ్‌హామ్‌షైర్‌ తరపున బరిలోకి దిగుతాడు. పరిపాలక కమిటీ (సీఓఏ) ఇప్పటికే సెంట్రల్‌ కాంట్రాక్టు క్రికెటర్లకు కౌంటీలాడేందుకు గ్రీన్‌ సిగ్నలిచ్చింది.అశ్విన్‌ ఒప్పందం ఇప్పటికే ఖరారైంది. రేపోమాపో బోర్డు సీఈఓ నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీ చేస్తారు’ అని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

ఇది ఇలా ఉంటే అశ్విన్‌కి ఇది రెండో కౌంటీ సీజన్. 2017లో అశ్విన్ వార్సెస్టెర్‌షైర్‌ తరపున నాలుగు మ్యాచ్‌‌లు ఆడాడు. అటు మరో ఆటగాడు రహానే హాంప్‌షైర్‌తో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ, కౌంటీ జట్లతో టచ్‌లో ఉండి…తమ ఆటగాళ్లకు కౌంటీ కాంట్రాక్టులు లభించేలా చొరవ తీసుకుంటోందని తెలుస్తోంది.