అమ్మాయితో సహజీవనం తప్పా..?: అథ్లెట్ ద్యుతి చంద్

ఓ టీనేజీ అమ్మాయితో తాను సహజీనం చేస్తున్నట్లు భారత మహిళా అథ్లెట్ ద్యుతి చంద్ ప్రకటించారు. వేగవంతమైన మహిళా రన్నర్‌గా గుర్తింపు పొందిన ద్యుతి.. స్వలింగ సహజీవనంపై బహిరంగంగా ప్రకటించిన తొలి భారత అథ్లెట్ కావడం విశేషం. అవును.. నేను 19ఏళ్ల టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె మా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. నేనెప్పుడు ఊరెళ్లినా ఆమెతోనే గడుపుతాను. ఆమెకు సహజీవనం ఇష్టం కాబట్టే మా […]

  • Tv9 Telugu
  • Publish Date - 11:01 am, Mon, 20 May 19
అమ్మాయితో సహజీవనం తప్పా..?: అథ్లెట్ ద్యుతి చంద్

ఓ టీనేజీ అమ్మాయితో తాను సహజీనం చేస్తున్నట్లు భారత మహిళా అథ్లెట్ ద్యుతి చంద్ ప్రకటించారు. వేగవంతమైన మహిళా రన్నర్‌గా గుర్తింపు పొందిన ద్యుతి.. స్వలింగ సహజీవనంపై బహిరంగంగా ప్రకటించిన తొలి భారత అథ్లెట్ కావడం విశేషం. అవును.. నేను 19ఏళ్ల టీనేజ్ అమ్మాయితో సహజీవనం చేస్తున్నా. ఆమె మా బంధువు. మా ఊర్లోనే ఉంటుంది. భువనేశ్వర్ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. నేనెప్పుడు ఊరెళ్లినా ఆమెతోనే గడుపుతాను. ఆమెకు సహజీవనం ఇష్టం కాబట్టే మా బంధం కొనసాగుతోంది. భవిష్యత్‌లోనూ ఆమెతోనే నా జీవితం ముడిపడి ఉంటుంది. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం. ఎప్పటిలాగే నా కెరీర్‌ను కొనసాగిస్తా అని 23ఏళ్ల ద్యుతి వెల్లడించింది.

ఇక తమ సహజీవనం పట్ల తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. అక్క మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని చెప్పుకొచ్చింది. ఇలాంటి పనులు మానుకోకపోతే జైలుకు పంపిస్తానని కూడా బెదిరించిందని వెల్లడించింది. అయితే మేజర్ అయిన తాను స్వతంత్రంగా ఉండాలని భావించానని.. అందుకే బహిరంగంగా సహజీవనంపై మాట్లాడుతున్నానని ద్యుతి తెలిపింది.

అయితే ఇప్పుడు కూడా తమ బంధాన్ని బయటపెట్టడానికి మరో కారణం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. గతంలో పింకీ ప్రమాణిక్ అనే మహిళా అథ్లెట్ తన సహచర అథ్లెట్‌ను బలత్కారం చేసినట్లు ఆరోపణలు రావడంతో ఆమె కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. అందుకే అన్ని ఆలోచించాకే, భాగస్వామితో చర్చించాకే తమ బంధాన్ని బయటపెడుతున్నానని పేర్కొంది. అందులోనూ సుప్రీం తీర్పు కూడా తమకు ధైర్యాన్నిచ్చిందని తెలిపింది.

కాగా ఆమె కెరీర్‌లోనూ సవాళ్లను ఎదుర్కొంది. ఆమె శరీరంలో పురుష హర్మోన్లు ఉన్నట్లు తేలడంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ద్యుతిపై నిషేధం విధించింది. దీన్ని ఆమె ఆర్బిట్రేషన్ కోర్టులో సవాల్ చేసి విజయం సాధించి మళ్లీ ట్రాక్‌లో అడుగెట్టింది. అయితే స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పునిచ్చిన సుప్రీం.. పెళ్లికి మాత్రం ఇంకా చట్టబద్ధత ఇవ్వలేదు.