Wrestlers Protest: రెజ్లర్లతో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చర్చలు.. ఈనెల 15 వరకు ఆందోళనలు విరామం..
రెజ్లర్ల ఆందోళనలో కీలక మలుపు చోటు చేసుకుంది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చర్చల తరువాత తమ ఆందోళనలను ఈనెల 15 వరకు వాయిదా వేశారు రెజ్లర్లు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌పై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తారని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు రెజ్లర్లు.

రెజ్లర్ల ఆందోళనలో కీలక మలుపు చోటు చేసుకుంది. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌తో చర్చల తరువాత తమ ఆందోళనలను ఈనెల 15 వరకు వాయిదా వేశారు రెజ్లర్లు. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌పై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తారని మంత్రి హామీ ఇచ్చారని తెలిపారు రెజ్లర్లు. బ్రిజ్‌భూషణ్‌ను అరెస్ట్ చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
రెజ్లర్ల ఆందోళన కీలక మలుపు తిరిగింది. రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన పహిల్వాన్లతో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమావేశమయ్యారు. దాదాపు 6గంటల పాటు జరిగిన చర్చల్లో కీలక పురోగతి సాధించారు. రెజ్లర్లకు కేంద్రమంత్రి లిఖితపూర్వంగా పలు హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఈనెల 15 వరకు ఆందోళనలు నిలిపివేత..
కేంద్రం ఇచ్చిన హామీతో ఈనెల 15వ తేదీ వరకు ఆందోళనలు నిలిపివేస్తునట్టు రెజ్లర్ భజరంగ్ పునియా ప్రకటించారు. పలు అంశాలపై కేంద్రమంత్రితో చర్చించినట్టు చెప్పారు. బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసుల దర్యాప్తు ఈ నెల 15నాటికి పూర్తవుతుందని.. ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తారని అనురాగ్ ఠాకూర్ హామీ ఇచ్చినట్టు తెలిపారు. రెజ్లర్లపై నమోదు చేసిన కేసులు కూడా ఎత్తేస్తామని హామీ ఇచ్చారు.




రెజ్లింగ్ ఫెడరేషన్‌కు జూన్ 30 లోపు ఎన్నికలు..
రెజ్లర్లతో దాదాపు 6గంటల పాటు చర్చలు జరిగాయని కేంద్రమంత్రి అనురాగ్‌ఠాకూర్ వెల్లడించారు. జూన్ 15 నాటికి దర్యాప్తును పూర్తి చేసి ఛార్జిషీట్ సమర్పిస్తామని రెజ్లర్లకు హామీ ఇచ్చినట్టు చెప్పారు. అలాగే రెజ్లింగ్ ఫెడరేషన్‌కు జూన్ 30 లోపు ఎన్నికలు నిర్వహిస్తామని అనురాగ్‌ఠాకూర్ చెప్పారు.
అనురాగ్‌ఠాకూర్‌తో బజరంగ్ పూనియాతో సాక్షి మాలిక్ కూడా చర్చలు జరిపారు. ఈనెల 15 వరకు తమ ఆందోళనలను వాయిదా వేస్తున్నామని, అప్పటిలోగా తమ డిమాండ్లు నెరవేర్చకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు రెజ్లర్లు. బ్రిజ్‌భూషణ్‌ను జైల్లో వేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా మహిళ?
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్‌గా మహిళను నియమించాలని కూడా కేంద్రమంత్రితో చర్చల సందర్భంగా పహిల్వాన్లు డిమాండ్ చేశారు. కేంద్రంతో రెజ్లర్లు చర్చలు జరపడం ఇది రెండోసారి. మూడు రోజుల క్రితం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కూడా రెజ్లర్లు సమావేశమయ్యారు.
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..