Ashes 2023: 2021లో టెస్టులకు రిటైర్మెంట్.. కట్‌చేస్తే.. ఐపీఎల్ తర్వాత రీ ఎంట్రీ.. ధోనీ సహచరుడి కీలక నిర్ణయం..
Aus vs Eng: ఇంగ్లండ్ బౌలర్ జాక్ లీచ్ నడుము భాగంలో స్ట్రెచ్ ఫ్రాక్చర్ కారణంగా యాషెస్‌కు దూరమయ్యాడు. లీచ్ స్థానంలో యాషెస్ సిరీస్ కోసం మొయిన్ అలీ ఇంగ్లండ్ జట్టులోకి వచ్చాడు. యాషెస్ సిరీస్ జూన్ 16న ప్రారంభమై జులై 31 వరకు జరగనుంది.
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ మొయిన్ అలీ టెస్టు క్రికెట్‌లోకి మరోసారి రీఎంట్రీ ఇచ్చాడు. టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్, ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్, ఇంగ్లండ్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ కీస్‌లతో మాట్లాడిన తర్వాత అతను ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ట్వీట్ ద్వారా సమాచారం అందించింది.
మొయిన్ అలీ 2021లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వన్డేలు, టీ20ల్లో ఆడుతూనే ఉన్నాడు. అయితే, యాషెస్ సిరీస్‌కు ముందే పునరాగమనం చేశాడు. స్పిన్నర్ జాక్ లీచ్ స్థానంలో మొయిన్ అలీని జట్టులోకి తీసుకున్నారు.
జూన్ 16 నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం..
ఇంగ్లండ్ బౌలర్ జాక్ లీచ్ నడుము భాగంలో స్ట్రెచ్ ఫ్రాక్చర్ కారణంగా యాషెస్‌కు దూరమయ్యాడు. లీచ్ స్థానంలో యాషెస్ సిరీస్ కోసం మొయిన్ అలీ ఇంగ్లండ్ జట్టులోకి వచ్చాడు. యాషెస్ సిరీస్ జూన్ 16న ప్రారంభమై జులై 31 వరకు జరగనుంది.
మొయిన్ అలీ టెస్ట్ కెరీర్..
He’s back! ?
Welcome back, Mo! #Ashes ??????? #ENGvAUS ??
— England Cricket (@englandcricket) June 7, 2023
మొయిన్ అలీ 2014లో ఇంగ్లండ్ తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత, అతను తన చివరి టెస్టును సెప్టెంబర్ 2021లో భారత్‌తో ఆడాడు. ఇంగ్లండ్ తరపున మొత్తం 64 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలతో 2914 పరుగులు చేశాడు. టెస్టుల్లో 195 వికెట్లు తీశాడు.
యాషెస్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జోనాథన్ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, డాన్ లారెన్స్, ఆలీ పోప్, మాథ్యూ పాట్స్, ఆలీ రాబిన్సన్, జో రూట్, జోష్ టాంగ్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..